లాక్ డౌన్ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. సినిమాలను తెరకెక్కించే విధానం నుండి కంటెంట్, రిలీజ్ ల విషయంలోనూ మార్పులు కనిపిస్తున్నాయి. ఇదివరకటిలా కమర్షియల్ సినిమాలను ప్రేక్షకులు ఆదరించడం లేదు. అలాగని కమర్షియల్ సినిమాలే కావాలని అనట్లేదు. అవి స్టార్ హీరోల సినిమాలైనా, యంగ్ హీరోల సినిమాలైనాకేవలం కంటెంట్ ప్రధానంగా సినిమాలను ఆదరిస్తున్నారు ప్రేక్షకులు. అందుకే ఇప్పుడు ప్రేక్షకుల అభిరుచులను బట్టి హీరోలు, దర్శక నిర్మాతలు సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నారు.
ఇక గతంలో వారానికి ఒకటి లేదా రెండు సినిమాలు రిలీజ్ అవుతుండేవి. కానీ.. లాక్ డౌన్ తర్వాత ఆ సంఖ్య నాలుగు నుండి ఐదు వరకు వెళ్ళింది. అవును.. ఇప్పుడు ప్రతివారం బాక్సాఫీస్ వద్ద నాలుగు 4 నుండి 5 సినిమాల వరకూ రిలీజ్ అవుతుండటం విశేషం. అంటే.. సినిమాల సంఖ్య పెరిగిందా లేక వాటన్నిటికీ ఒకేసారి రిలీజ్ షెడ్యూల్ కుదిరిందా అనే సందేహాలు కలగవచ్చు. ఈ విషయం పక్కన పెడితే.. ఈ వారం(సెప్టెంబర్ 3వ వారం) టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద 8 సినిమాలు బరిలోకి దిగుతున్నాయి. ఇందులో రెండు డబ్బింగ్ సినిమాలు ఉన్నాయి.
ఈ వారం థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాలు!
సెప్టెంబర్ 15:
సెప్టెంబర్ 16:
మొత్తానికి ఈ వారం 8 సినిమాలతో థియేటర్స్ వద్ద సందడి నెలకొనబోతుంది. మరి ఈ సినిమాలలో మీరు ఏ సినిమా కోసం ఎదురు చూస్తున్నారో కామెంట్స్ లో తెలియజేయండి.