తెలుగులో చాలాఏళ్ల నుంచి ఉన్న నటుడు, కమెడియన్ అల్లు రమేష్ తుదిశ్వాస విడిచారు. వైజాగ్ కి చెందిన ఆయన గుండెపోటుతో మరణించారు.
టాలీవుడ్ లో విషాదం నెలకొంది. పలు సినిమాల్లో సహాయ పాత్రల్లో నటించి ఓ మాదిరి గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్ అల్లు రమేష్ తుదిశ్వాస విడిచారు. ఈ క్రమంలోనే యంగ్ డైరెక్టర్ ఆనంద్ రవి తన ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ పెట్టాడు. వైజాగ్ లో ఉంటున్న ఆయన.. తాజాగా గుండెపోటుతో మరణించారు. ఈ విషయం కాస్త ఇప్పుడు ఆయన కుటుంబంలో విషాదం నింపింది. దీంతో ఆయన స్నేహితులు, సహ నటీనటులు సంతాపం తెలియజేస్తున్నారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. వైజాగ్ కు చెందిన అల్లు రమేష్ తొలుత నాటకాల్లో నటించారు. ఆ తర్వాత ఇండస్ట్రీలోకి వచ్చారు. అయితే చెప్పుకోదగ్గ పాత్రలు లేకపోయినప్పటికీ.. తనదైన కోస్తా యాసతో గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం యూట్యూబ్ లో ప్రసారమవుతున్న ‘మా విడాకులు’ వెబ్ సిరీస్ లో మామగా నటిస్తున్నారు. షార్ట్స్, రీల్స్ చూసేవారికి.. ఈ సిరీస్ గురించి, అందులో కామెడీతో నవ్విస్తున్న రమేష్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు. అలాంటి ఆయన ఇప్పుడు సడన్ గా చనిపోవడంతో అందరూ బాధపడుతున్నారు. మీ తరఫున సంతాపాన్ని వీలైతే కింద కామెంట్ పెట్టి తెలియజేయండి.