నందమూరి తారకరత్న తీవ్రమైన గుండెపోటు కారణంగా.. ఫిబ్రవరి 18న మృతి చెందాడు. మార్చి 2న ఆయన కుటుంబ సభ్యులు తారకరత్న పెద్ద కర్మ నిర్వహించారు. ఈ సందర్భంగా అలేఖ్యారెడ్డి.. భర్త తనకు రాసిన లవ్ లెటర్‌ని షేర్ చేసింది. ఆ వివరాలు..
39 ఏళ్ల వయసు.. అంటే చాలా చిన్నది.. చూడాల్సిన జీవితం ఎంతో ఉంది. అసలైన బాధ్యతలు ముందు ముందు రాబోతున్నాయి. రాబోయే రోజుల్లోనే కుటుంబానికి పెద్ద అవసరం ఎక్కువ. బిడ్డలకు తండ్రి అవసరం కూడా అప్పుడే అధికం. కానీ దురదృష్టం కొద్ది తారకరత్న జీవితంలో ఇవేవి చూడకుండానే భార్యాబిడ్డలను వదిలేసి అనంత లోకాలకు వెళ్లాడు. గుండెపోటు కారణంగా ఆస్పత్రిలో చేరిన తారకరత్న.. 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడి.. ఆఖరకు కన్ను మూశాడు. ఆయన మరణంతో అటు నందమూరి కుటుంబంలోనే కాక.. టీడీపీలో, సినీ ఇండిస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఇక తారకరత్న మృతి ప్రతొ ఒక్కరిని కదిలిస్తోంది. మరీ ముఖ్యంగా తారకరత్న భార్య అలేఖ్యారెడ్డిని ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు. ప్రాణంగా ప్రేమించిన భర్త మరణాన్ని ఆమె జీర్ణించుకోలేకపోతున్నారు. తారకరత్న అంతిమ సంస్కారాలు, చిన్న కర్మలో అలేఖ్యారెడ్డిని చూసినవారెవరికైనా.. గుండె బరువెక్కక మానదు. అంతులేని విషాదానికి నిలువెత్తు రూపంలా ఉన్నారు అరేఖ్యారెడ్డి.
ఇక మార్చి 2న తారకరత్న కుటుంబ సభ్యులు ఆయన పెద్ద కర్మ నిర్వహించారు. ఈ సందర్భంగా అలేఖ్యారెడ్డి కన్నీరుమున్నీరుగా విలపించారు. కుటుంబ సభ్యులతో పాటు సన్నిహితులు ఆమెను ఓదార్చారు. ఇదిలా ఉంటే, పెద్ద కర్మ సందర్భంగా భర్తను గుర్తుచేసుకుంటూ అలేఖ్యారెడ్డి ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. అది చూసిన వారికి.. తారకరత్న-అలేఖ్యారెడ్డి మధ్య ఎంత బలైమన బంధం ఉందో.. ఆయన తన భార్యను ఎంతలా ప్రేమించారో అర్థం అవుతుంది. ఇక గతంలో వాలైంటన్స్ డే సందర్భంగా భర్త తారకరత్న తనకు రాసిన లేఖను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేశారు అలేఖ్యారెడ్డి. ఈ లెటర్ చూస్తే.. తారకరత్నకు భార్య అంటే ఎంత ప్రేమో అర్థం అవుతుంది. భార్యను బంగారు తల్లి అంటూ సంబోధించి.. ఆమెపై తనకున్న అనురాగాన్ని చాటుకున్నాడు తారకరత్న.
ఇక తారకరత్న రాసిన లేఖలో తనకు అస్సలు ప్రేమను వ్యక్తపరచడం రాదంటూనే భార్య అంటే తనకు ఎంత ప్రేమో చాలా గొప్పగా చెప్పుకొచ్చారు. ఈ లేఖలో తారకరత్న.. ‘నాకున్నది నువ్వు మాత్రమే, నువ్వంటే నా ప్రపంచం బంగారం’ అంటూ భార్యకు వాలైంటన్స్ డే శుభాకాంక్షలు తెలిపారు తారకరత్న. ఆ లేఖను చదివిన ప్రతి ఒక్కరూ ఎంతో ఎమోషనల్ అవుతున్నారు. అంత గొప్పగా ప్రేమించే భర్తను పొందడం అలేఖ్యారెడ్డి అదృష్టమని.. అలాంటి భర్తను కోల్పోవడం ఆమె దురదృష్టమని కామెంట్స్ చేస్తున్నారు నెటిజనులు.
లెటర్ పోస్ట్ చేయడంతో పాటు.. తారకరత్న గురించి ఎంతో గొప్పగా రాసుకొచ్చారు అలేఖ్యారెడ్డి. లెటర్‌తో పాటు.. ‘మనం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. జీవితంలో ఎన్నో ఎత్తుపళ్లాలు చూశాం. అత్యంత క్లిష్ట పరిస్థితులను చూశాం.. అయినప్పటికీ నువ్వు, నేను కలిసి ఇంత దూరం ప్రయాణించాం. ఎన్ని కష్టాలు ఎదురైనా మనం నమ్మకం కోల్పోకుండా మంచి రోజుల కోసం ఎదురుచూశాం. మనకోసం ఒక చిన్న కుటుంబాన్ని సృష్టించుకున్నాం. అసలు నువ్వేంటో ఎవ్వరికీ తెలీదు. నిన్ను ఎవ్వరూ సరిగా అర్థం చేసుకోలేదు. నేను నిన్ను అర్థం చేసుకున్నందుకు ఎంతో సంతోషిస్తున్నాను. బాధలన్నింటినీ నీలోనే దాచుకుని.. మాకు మాత్రం అంతులేని ప్రేమను పంచావు. మన చుట్టూ ఉన్నవాళ్లు ఎన్ని పచ్చి అబద్ధాలు చెప్పినా పట్టించుకోకుండా మరింత ఎత్తుకు ఎదుగుతా నాన్న. ఈరోజు నిన్ను ఎంతగానో మిస్ అవుతున్నా నాన్న’ అంటూ భర్తను తలచుకుని తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు అలేఖ్యారెడ్డి. ఆమె షేర్ చేసిన లెటర్, పోస్ట్ చూసిన ప్రతి వారు తీవ్ర భావోద్వేగానికి గురవుతున్నారు. అలేఖ్యారెడ్డి త్వరగా ఈ బాధ నుంచి బయటపడాలని కోరుకుంటున్నారు.