ఓ వైపు మన తెలుగు డైరెక్టర్లు తమిళ హీరోలకి భారీ హిట్లను ఇస్తుంటే.. అక్కడి దర్శకులు మాత్రం మన టాప్ హీరోలకి హిట్ ఇవ్వడంలో విఫలమవుతూనే ఉన్నారు. ఎప్పటినుండో మొదలైన ఈ సెంటిమెంట్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది . అయినా.. ఇప్పుడు మన స్టార్ హీరోలు వారితో చేయి కలపడం తెలుగు ప్రేక్షకులని ఆందోళనకు గురి చేస్తుంది.
సౌత్ లో టాలీవుడ్, కోలీవుడ్ సినిమాలదే హవా. రెండు ఇండస్ట్రీలో కూడా స్టార్ హీరోలకు, టాప్ డైరెక్టర్లకు కొదువ లేదు. ఈ క్రమంలో తమిళ డైరెక్టర్లు మన తెలుగు హీరోలతో కొన్ని సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ తమిళ తంబీలు తెలుగు హీరోలతో చేతులు కలిపితే ఆ సినిమా ఖచ్చితంగా ప్లాప్ అవుతుంది అనే సెంటిమెంట్ అందరిలో బలంగా నాటుకుపోయింది. ప్రస్తుతం ఈ సెంటిమెంట్ మన తెలుగు ప్రేక్షకులని ఆందోళనకు గురి చేస్తుంది. ఓ వైపు మన డైరెక్టర్లు అక్కడ హీరోలకి భారీ హిట్లను ఇస్తుంటే.. అక్కడి దర్శకులు మాత్రం మన టాప్ హీరోలకి హిట్ ఇవ్వడంలో విఫలమవుతూనే ఉన్నారు. అయినా.. ఇప్పుడు మన స్టార్ హీరోలు వారితో చేయి కలపడం గమనార్హం.
ఎస్ జె సూర్య, ఏఆర్ మురుగదాస్, గౌతమ్ మీనన్ వీరందరూ తమిళ్లో చాలా పేరునా డైరెక్టర్లే. కానీ మన హీరోల దగ్గరికి వచ్చేసరికి వారి ఇమేజ్ తో పాటు మన హీరోల మార్కెట్ ని పోగొడుతున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో.. ఎస్ జె సూర్యతో రెండు సినిమాలను తెరకెక్కించాడు. వీటిలో ఖుషి సూపర్ హిట్ కాగా.. కొమరం పులి డిజాస్టర్ గా నిలిచింది. ఇక ఈ డైరెక్టర్ మహేష్ తో తీసినటువంటి నాని సినిమా కూడా భారీ ప్లాప్ గా నిలిచింది. కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్.. చిరంజీవితో స్టాలిన్, మహేష్ బాబుతో స్పైడర్ లాంటి సినిమాలన తీసి అంచనాలని అందుకోవడంలో విఫలమయ్యాడు. ఇక తాజాగా లింగుస్వామి రామ్ పోతినేనితో వారియర్ అనే సినిమా తీస్తే ఈ సినిమా భారీ నష్టాలను మిగిల్చింది.
ఈ లిస్టులో యంగ్ స్టార్స్ నాగ చైతన్య, నాని, గోపి చంద్ కూడా ఉన్నారు. కృష్ణ మారిమత్తుతో చేసిన సినిమా “యుద్ధం శరణం గచ్చామి” ఇటీవలే ప్రభు దర్శకత్వంలో చేసిన బైలింగువల్ సినిమా “కస్టడీ” నాగ చైతన్యకి నిరాశని మిగిల్చాయి. ఇక నాని నటించిన సెగ, ఎటోవెళ్లిపోయింది మనసు సినిమాలు కూడా తమిళ్ డైరెక్టర్లు చేసినవే. తమిళ డైరెక్టర్ శివ.. గోపి చంద్ కి శంఖం రూపంలో, రవి తేజకి దరువు రూపంలో రెండు డిజాస్టర్లను ఇచ్చారు. అంతే కాదు విష్ణు వర్ధన్ డైరెక్షన్ లో చేసిన “పంజా”, ధరణి దర్శకత్వంలో చేసిన “బంగారం” పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఆశించిన విజయాలను అందించలేకపోయాయి. సీనియర్ సూపర్ హీరోలైన చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ కి కూడా ప్లాప్స్ తప్పలేదు.
ప్రస్తుతం టాలీవుడ్ మెగా పవర్ స్టార్.. తమిళ దర్శకుడైన శంకర్ కి అవకాశం ఇవ్వడం.. సముద్రఖనితో పవన్ కళ్యాణ్ సినిమా చేయడం ఇప్పుడు మెగా ఫ్యామిలిలో కంగారు పుట్టిస్తుంది. శంకర్ చరణ్ తో చేస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా ఈ సంక్రాంతికి రిలీజ్ వుతుండగా.. సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న సినిమా ఏ ఏడాది చివర్లో విడుదల కానుంది. మరి సెంటిమెంట్ గా వీరు కూడా మన స్టార్ హీరోలకి ప్లాప్ ని ఇస్తారా ? లేకపోతే వాటిని బ్రేక్ చేసి సూపర్ హిట్ అందిస్తారో చూడాలి. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.