32 ఏళ్ళ వయసు మీదపడినా సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా వెలుగుతోంది మిల్కీ బ్యూటీ తమన్నా.. అసలు ఈ పాలబుగ్గల సుందరి ఏం తింటుందో గానీ రోజురోజుకూ మరింత అందంగా మెరిసిపోతుంది. ఈ మధ్య సినిమా వార్తలకంటే కొత్తకొత్త ఫోటోషూట్స్, వర్కౌట్ వీడియోలతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇండస్ట్రీలో అడుగుపెట్టి పదిహేనేళ్లు గడిచినా.. తమన్నా సౌందర్యం గురించి ఎంత చెప్పినా తక్కువే అంటున్నారు గ్లామర్ ప్రియులు. ఎందుకంటే.. కెరీర్ ప్రారంభం నుండి ఇప్పటికీ అమ్మడు అంతే నాజూకుగా ఫిట్నెస్ మెయింటైన్ చేస్తోంది.
ఈ భామ సినిమాలపరంగా ఎన్ని ఇండస్ట్రీలు తిరిగినా స్టార్డమ్ అందుకుంది మాత్రం తెలుగులోనే. అందుకే ఎలాంటి అప్డేట్స్ ఉన్నా వెంటనే ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటుంది. తమన్నా ఫిట్నెస్ కి ప్రాధాన్యత ఇస్తుందని తెలుసు కానీ.. మరీ వయసు పెరిగినకొద్దీ అందం పెరగడం ఏంటనేది ఆశ్చర్యం కలిగించే విషయం. మామూలుగానే తమన్నా మేనిఛాయకు కళ్ళు జిగేల్ మంటుంటాయి. మరి అలాంటి మిల్కీ బ్యూటీ.. అందాలన్నీ బౌన్స్ అయ్యేలా స్కిన్ టైట్ డ్రెస్ వేస్తే.. కుర్రాళ్ళ పరిస్థితి ఏంటి? ప్రస్తుతం తమన్నా ఫ్యాన్స్, నెటిజన్స్ పరిస్థితి అదే.
సోషల్ మీడియాలో తమన్నా పోస్ట్ చేసిన కొత్త ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలలో తమన్నాను చూస్తే ఖచ్చితంగా కళ్లప్పగించేస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. స్కై బ్లూ కార్సెట్ డ్రెస్ ధరించి.. మిల్కీ టాప్ టు బాటమ్ అందాలన్నీ కెమెరా ముందుంచింది. అసలు ఆ కళ్లు.. మెరిసే ఒళ్ళు.. అబ్బబ్బా చూస్తేనే నరాలు జివ్వుమంటున్నాయని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. నిలబడి థైస్ కనిపించేలా పోజివ్వటంలోనే ఫుల్ మార్కులు కొట్టేసింది. ఈ అమ్మడి అందానికి సోషల్ మీడియాలో కూడా అదే రేంజి ఫాలోయింగ్ ఉంది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ఈ బ్యూటీ వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉంటోంది. మరి తమన్నా లేటెస్ట్ అందాల విందుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.