తాప్సీ దానికోసం ఏకంగా నెలకు లక్ష రూపాయలు ఖర్చు చేస్తోంది. స్వయంగా ఈ విషయాన్ని ఆమెనే బయటపెట్టింది. తాప్సీ చేస్తున్న పనివల్ల ఆమె నాన్న కూడా తిడుతున్నారట. ఇంతకీ ఏం జరిగిందో తెలుసా?
హీరోయిన్ తాప్సీ పేరు చెప్పగానే మంచి మంచి సినిమాలు గుర్తొస్తాయి. తెలుగులో ఎక్కువగా గ్లామరస్ రోల్స్ చేసిన ఈమె.. హిందీలో మాత్రం యమ క్రేజ్ తెచ్చుకుంది. లేడీ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తూ పాన్ ఇండియా లెవల్లో ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేస్తూ ఉంది. అయితే అందరు బ్యూటీస్ లా ఈమె సైలెంట్ గా పని చేసుకుని వెళ్లిపోదు. అప్పుడప్పుడు కావాలని అలా చేస్తుందో? లేదా అలా జరిగిపోతాయో తెలీదు గానీ కాంట్రవర్సీల్లో చిక్కుకుంటుంది. తాజాగా సమ్ థింగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది. ఆ ఒక్క విషయంలో నెలకు రూ.లక్ష ఖర్చు చేస్తున్నానని చెప్పుకొచ్చింది. ఇది కాస్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ముంబయికి చెందిన తాప్సీ, మంచు మనోజ్ ‘ఝుమ్మంది నాదం’తో హీరోయిన్ గా మారింది. ఆ తర్వాత టాలీవుడ్ లో ప్రభాస్, రవితేజ, వెంకటేష్, గోపీచంద్ లాంటి హీరోలతో కలిసి వర్క్ చేసింది. 2015-16 టైంలో బాలీవుడ్ లో సినిమాలు చేయడం స్టార్ట్ చేసింది. ఇక అప్పటినుంచి హిందీలో స్టార్ హీరోయిన్ అయిపోయింది. సొంతంగా ప్రొడక్షన్ హౌస్ కూడా పెట్టుకుని పలు సినిమాలు కూడా తీసింది. చివరగా తెలుగులో ‘మిషన్ ఇంపాజిబుల్’ అనే మూవీలో కనిపించిన తాప్సీ.. తాజాగా ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ తన డైట్ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
‘హీరోయిన్ గా ఉండటం కోసం చాలా డబ్బు ఖర్చు పెడుతూ ఉంటాను. ఒక్కో సినిమా కోసం ఒక్కోలా మారాల్సి ఉంటుంది. శరీరం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మారిపోతూ ఉంటుంది. అందుకే బాడీని ఫిట్ గా ఉంచుకునేందుకు డైటీషియన్ ని పెట్టుకున్నాను. ప్రతినెలా దాదాపు డైటీషియన్ కోసం లక్ష రూపాయలకు పైగా ఖర్చు చేస్తున్నాను. ఈ విషయమై అమ్మనాన్న ఎప్పుడూ నన్నూ తిడుతూనే ఉంటారు. చిన్నప్పుడు ఫాదర్స్ డే పెన్ కొని నాన్నకే ఇచ్చాను. అయినా సరే ఎందుకు డబ్బులు వేస్ట్ చేస్తున్నావని నన్ను తిట్టారు. ఆ విషయంలో నా పేరెంట్స్ అయితే ఇంకా ఏం మారలేదు. ఇప్పుడు ఇంటికి వెళ్తే.. దీనిపై కూడా మరో డిస్కషన్ ఉంటుంది. ఇప్పుడు ఏం తినాలో ఏం తినకూడదో తెలియదు. అందుకే స్పెషల్ గా డైటీషియన్ కోసం అంత ఖర్చు పెట్టాల్సి వస్తోంది.’ అని తాప్సీ చెప్పుకొచ్చింది. మరి ఈమె చెప్పిన దానిపై మీరేం అనుకుంటున్నారు. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి.