ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలోని నాటునాటు పాట ఆస్కార్‌కు నామినేట్ అవ్వడంతో తెలుగు సినిమా ఇండస్ట్రీపై అలాగే ఆ సినిమా దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళిపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురిసింది. ఆస్కార్‌కు నామినేట్ అయిన తొలి తెలుగు పాటగా నాటునాటు చరిత్ర సృష్టించింది. తెలుగు సినిమాతో పాటు ఇండియన్ సినిమాను రాజమౌళి మరో మెట్టు ఎక్కించారంటూ.. దేశమంతా గర్వించింది. అయితే.. రాజమౌళి ఇప్పుడు సాధించిన ఘనతను 38 ఏళ్ల కిందటే అంటే.. 1986లోనే కళాతపస్వి కె.విశ్వనాథ్ సాధించారనే విషయం చాలా మందికి తెలియదు. 1985లో విడుదలైన స్వాతిముత్యం అనే సినిమా తెలుగు, తమిళ రాష్టాల్లో పెను సంచలనం సృష్టించింది. కమల్‌హాసన్ నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. భారతీయ చలనచిత్ర చరిత్రలోనే గొప్ప చిత్రంగా స్వాతిముత్యం పేరుతెచ్చుకుంది.
ఈ సినిమాను భారత ప్రభుత్వం మన దేశం తరఫున 1986వ ఏడాదిలో ఆస్కార్ నామినేషన్స్ కోసం ఎంట్రీగా పంపింది. దీంతో మన తెలుగు సినిమా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది. తొలి సారి ఒక తెలుగు సినిమాను ఆస్కార్‌కు నామినేట్ చేసింది భారత ప్రభుత్వం. ఆ సినిమాలోని గొప్పతనం గుర్తించడం తెలుగు జాతికి దక్కిన గౌరవంగా భావించారు. తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ సినిమా అప్పట్లోనే విదేశాల్లో కూడా ప్రదర్శించారు. అయితే.. ఆస్కార్ అవార్డు కోసం ఆ కమిటీ పెట్టిన కొన్ని స్టాండెడ్స్ అప్పట్లో లేకపోవడంతో స్వాతిముత్యం ఆస్కార్‌కు నామినేట్ కాలేదు. అయితే.. భారతీయ చలన చిత్ర రంగాన్ని హిందీ సినిమా ఏలుతున్న కాలంలో ఒక తెలుగు దర్శకుడు తీసిని సినిమా ఏకంగా ఆస్కార్ కోసం దేశం తరఫున నామినేట్ అవ్వడం సాధారణ విషయం కాదు.. అదో చరిత్ర.
ఆస్కార్‌కు ఇండియా తరఫున నామినేట్ అవ్వడంతో పాటు.. జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో ఉత్తమ తెలుగు చిత్రంగా నిలిచింది. అలాగే నంది అవార్డుల్లో బంగారు నది స్వాతిముత్యం సినిమాకే దక్కింది. అలాగే ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో ఉత్తమ తెలుగు దర్శకుడు అవార్డు కూడా విశ్వనాథ్‌నే వరించింది. ఇక ఈ సినిమా కథానాయకుడు కమల్‌హాసన్‌కు ఉత్తమ నటుడిగా నంది అవార్డును తెచ్చిపెట్టింది. తెలుగులో అద్భుత విజయం సాధించిన ఈ సినిమాను తమిళ్‌లో ‘సిప్పికుల్ ముత్తు’గా, హిందీలో ‘ఈశ్వర్’గా, అలాగే కన్నడలోకి ‘స్వాతిముత్తు’ అనువదించారు.
1986లోనే ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమా పేరు మారుమోగిపోయేలా చేసిన సినిమా స్వాతిముత్యం. తెలుగుసినిమా స్థాయిని దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా చాటిచెప్పిన సినిమా. కళాతపస్వి కె.విశ్వనాథ్ స్థాయి ఏంటో చెప్పే సినిమానే స్వాతిముత్యం. అలాంటి సినిమా తీసి.. ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు పొందిన కళాతపస్వి కె.విశ్వనాథ్.. తన 92 ఏట కన్నుముశారు. ఆయన దేహానికి మరణం ఉండొచ్చు కానీ.. ఆయన రుపొందించిన కళాఖండానికి మాత్రం మరణం లేదు. తెలుగు సినిమా ఉన్నంత వరకు చెప్పుకునే సినిమాలుగా స్వాతిముత్యం, శంకరాభరణం, సాగరసంగమం నిలుస్తాయి. అలాగే.. భారతీయ సినిమా ఉన్నంత వరకు గొప్ప దర్శకుడిగా కె.విశ్వనాథ్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది.
Listening to #KVishwanath garu songs is pure bliss 🥺❤️ #RIPVishwanathGaru pic.twitter.com/DPBAjzAk8D
— внαиυ αяυℓ ᶜᴴᴵᴿᵁ ᴿᶜ ᴾᴵᴺᴷʸ (@BBhanuTweets) February 3, 2023