ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీలే కాదు.. ఇంకా ఇండస్ట్రీలో అడుగుపెట్టని వారి పిల్లలు కుడా సోషల్ మీడియాలో సెలబ్రిటీలుగా అవతరిస్తుండటం చూస్తూనే ఉన్నాం. సినిమాలు చేసి క్రేజ్ తెచ్చుకున్నారంటే ఓకే.. కానీ ఎలాంటి సినిమాలు, షార్ట్ ఫిలిమ్స్ చేయకుండా పాపులారిటీ సంపాదించుకోవడం అనేది సంతోషించాల్సిన విషయమే. అయితే.. ఆ పాపులారిటీ సినీ ఇండస్ట్రీకి చెందడం వల్ల వస్తే మాత్రం.. ఖచ్చితంగా ఇండస్ట్రీకి సంబంధించిన మనిషి కావడం వల్లనే క్రేజ్ వచ్చిందని చెబుతుంటారు.
తెలుగు ప్రేక్షకులకు పాపులర్ ఆర్టిస్ట్ సురేఖావాణి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఇప్పటివరకూ ఎన్నో సినిమాలు చేసిన సురేఖా కంటే ఆమె కూతురు సుప్రీత నాయుడు నెట్టింట వీడియోలు చేసి సోషల్ మీడియాలో సూపర్ క్రేజ్ దక్కించుకోవడం విశేషం. అందంగా ఉంటుంది కానీ.. సుప్రీత ఇంతవరకు ఓ షార్ట్ ఫిల్మ్, ఓ సినిమా కూడా చేయలేదు. సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం బాగానే వెనకేసుకుంది. క్రియేట్ చేసుకుంది సుప్రీత నాయుడు.
సుప్రీత గురించి నెటిజన్లకు కొత్తగా చెప్పక్కర్లేదు. ఈ మధ్యే ప్రైవేట్ మ్యూజిక్ ఆల్బమ్ లో కనిపించి సందడి చేసింది. త్వరలోనే ‘లేచింది మహిళా లోకం’ అనే సినిమాతో టాలీవుడ్ లో నటిగా డెబ్యూ చేయబోతుంది. సుప్రీత సోషల్ మీడియాలో ఎంత యాక్టీవ్ గా ఉంటుందో.. ఫోటోషూట్స్, వీడియోలతో ఆ స్థాయి రచ్చ చేస్తుంటుంది. అందుకు నిదర్శనంగా నిలుస్తోంది సుప్రీత పోస్ట్ చేసిన కొత్త వీడియో. బీస్ట్ సినిమాలోని పూజా హెగ్డే డైలాగ్ కి పెదాలు కదిలించి రీల్ చేసింది. బ్లాక్ టాప్, జీన్స్ ధరించిన సుప్రీత.. నడుము చూపిస్తూ డైలాగ్స్ చెప్పింది. మరి కుర్రకారు అయితే బ్యూటీ వీడియోను బాగా ఎంజాయ్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. మరి సుప్రీత కొత్త వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.