సుడిగాలి సుధీర్- రష్మీ గౌతమ్ వీళ్లిద్దరకీ బుల్లితెర మీద ఉన్న ఫాలోయింగ్ నిజానికి ఓ మోస్తర్ హీరో, హీరోయిన్లకు కూడా ఉండదు. సుడిగాలి సుధీర్ కి ఓ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. సుధీర్ ఒక్కడే కాదు.. రష్మీ కూడా ఏ పోస్ట్ పెట్టినా సుధీర్ ఫ్యాన్స్ అంతా కలిసి తెగ వైరల్ చేస్తారు. వీళ్లిద్దరూ జబర్దస్త్ కామెడీ షోలో దాదాపు ఓ ఐదారుసార్లు పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే నిజ జీవితంలో మాత్రం మంచి ఫ్రెండ్స్ అని చెబుతుంటారు. వారి మాటలు ఎలా ఉన్నా సుధీర్ ఫ్యాన్స్ మాత్రం వాళ్లిద్దరినీ అన్నా, వదినా అనే పిలుస్తుంటారు.
తాజాగా రష్మీ కేజీఎఫ్ 2లో శ్రీనిధిశెట్టిలా లెహంగా వేసుకుని ‘మెహబూబా మే తెరి మెహబూబా’ అంటూ సూపర్ డూపర్ హిట్ ట్రాక్ తో ఇన్ స్టాగ్రామ్ రీల్ చేసింది. చాలా రోజుల తర్వాత నా భావాలకు తగిన రీల్ ఒకటి చేశాను అనే అర్థం వచ్చేలా కోట్ చేసింది. ఆ పోస్టు పెట్టిన తర్వాత సుధీర్ ఫ్యాన్స్ వైరల్ చేయడమే కాకుండా.. వదినా వదినా అంటూ కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం రష్మీ చేసిన ఆ రీల్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సుడిగాలి సుధీర్ విషయానికి వస్తే.. జబర్దస్త్ నుంచి మాత్రమే కాకుండా.. శ్రీదేవీ డ్రామా కంపెనీ నుంచి కూడా తప్పుకున్న విషయం తెలిసిందే. అయితే శ్రీదేవీ డ్రామా కంపెనీలో సుధీర్ స్థానంలో రష్మీని యాంకర్ గా తీసుకున్నారు. రష్మీ పోస్ట్ పై సుధీర్ ఫ్యాన్స్ కామెంట్స్ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.