టాలీవుడ్‌లో ప్రస్తుతం సంగీత దర్శకుడు థమన్ మ్యానియా నడుస్తోంది. ఆయన మ్యూజిక్ అందించిన సినిమాలు సంగీతం పరంగా సూపర్ హిట్లుగా నిలుస్తున్నాయి. మ్యూజిక్ విషయంలో సినిమా దర్శకుల మొదటి ఛాయిస్‌గా థమన్ నిలుస్తున్నారు. థమన్ ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ భాషల్లోనూ సినిమాలు చేస్తున్నారు. తెలుగు, తమిళంలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. ఇక, తెలుగులో అందరు హీరోలతో థమన్ పనిచేశారు. అయితే, తనకు జూనియర్ ఎన్టీఆర్ అంటే అమితమైన ప్రేమ అని చాలా ఇంటర్వ్యూల్లో థమన్ చెప్పుకొచ్చారు. ఇందుకు కారణం ఏంటో వివరిస్తూ..
‘‘ బృందావనం రెండు సాంగ్స్ కంపోజ్ చేశాను. వంశీ వాటిని జూనియర్ ఎన్టీఆర్ దగ్గరకు తీసుకెళ్లాడు. పాటలు నచ్చితే అతడ్నే మ్యూజిక్ డైరెక్టర్‌గా పెట్టుకుందాం అని చెప్పాడు. తారక్‌కు మ్యూజిక్ అంటే చాలా గౌరవం. పాటల్ని ఫుల్ వాల్యూమ్‌లో వింటాడు. పాట మిడిల్లో ఆపేసి.. నా గురించి అడిగారంట. తర్వాత నాకు ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావురా అన్నారు. కళ్ల నిండా నీళ్లతో అక్కడికి వెళ్లిపోయాను. నా జీవితంలో గుర్తుండిపోయే ఘటన అది. ఒక్క సినిమా కూడా రిలీజ్ అవ్వకుండా ఓ కొత్త మ్యూజిక్ డైరెక్టర్‌కు పిలిచి మరీ సినిమా అవకాశం ఇవ్వటం ఓ పెద్ద విషయం.
నా జీవితాంతం ఆయనకు బుణపడి ఉంటాను. అందుకే ఆయనకు ప్లాప్ మ్యూజిక్ ఇవ్వలేను. ఆయన నా గుండెలో ఉంటారు. కాబట్టి 200 శాతం మంచి మ్యూజికే ఇస్తాను’’ అని అన్నారు. కాగా, థమన్ ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్- మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమా శరావేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో పాటు ఎస్‌ఎస్‌ఎమ్‌బీ 28కు కూడా మ్యూజిక్ అందిస్తున్నారు. మరి, థమన్‌కు జూనియర్ ఎన్టీఆర్‌పై ఉన్న అభిమానంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.