గత కొన్నేళ్లలో టీవీలో రియాలిటీ షోలు బాగా పాపులర్ అయ్యాయి. జనాల్ని ఎప్పుడు కూడా ఎంటర్ టైన్ చేస్తూ వచ్చాయి. ఒకప్పుడు షో అనగానే దానికి తగ్గట్లే కంటెంట్ ఉండేది. కానీ కొన్నాళ్ల నుంచి మాత్రం జోడీల మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ చేస్తూ వచ్చారు. అలా అద్భుతమైన ఫేమ్ తెచ్చుకున్న వారిలో సుధీర్-రష్మీ టాప్ లో ఉంటారు. వాళ్లిద్దరి ఏం ఉందనేది పక్కనబెడితే.. స్క్రీన్ పై ఎప్పుడు కనిపించినా సరే మ్యాజిక్ వర్కౌట్ అయ్యేది. ఆ తర్వాత షోల్లో చాలా జోడీలు పుట్టుకొచ్చాయి. కానీ వారిలో ఇమ్యాన్యుయేల్-వర్ష మాత్రం కాస్తలో కాస్త బెటర్. వాళ్లిద్దరి మధ్య కూడా కొన్నాళ్ల నుంచి సరిగా మాటల్లేవు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ‘జబర్దస్త్’ షో ద్వారానే వర్ష-ఇమ్మాన్యుయేల్ కలిశారు. కెవ్వు కార్తిక్ టీంలో ఫస్ట్ టైం కలిసి యాక్ట్ చేశారు. ఆ సమయంలోనే వాళ్లిద్దరి మధ్య ప్రేమ పుట్టింది! రిలేషన్ షిప్ కూడా స్టార్టయింది! అలా మొదలైన వీరి జర్నీ.. మధ్యలో చిన్న చిన్న గొడవల కారణంగా డిస్ట్రబ్ అయినట్లు కనిపించింది. ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ షోలోనే వర్షని ‘మగాడు’ అని ఇమ్ము డైరెక్ట్ గా అనేయడం.. ఆమె సీరియస్ కావడం, షో మధ్యలో నుంచి వెళ్లిపోవడం మనందరం చూశాం. ఆ తర్వాత కూడా ఒకటి రెండుసార్లు వీళ్లిద్దరి మధ్య సీరియస్ ఇష్యూస్ కనిపించాయి. ఈ క్రమంలోనే వీళ్లిద్దరూ మాట్లాడుకోవడం మానేశారు! దీంతో షో నిర్వహకులు కూడా వర్ష-ఇమ్ముతో ఎలాంటి స్కిట్స్, ఎపిసోడ్స్ గానీ ప్లాన్ చేయలేదు.
అయితే తాజాగా రిలీజ్ చేసిన ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ ప్రోమోలో మాత్రం ఆ విషయమై ఓపెన్ అయ్యాడనిపించింది. ‘నువ్వంటే ప్రాణమని.. నీతోనే లోకమని’ అనే బ్రేకప్ గీతాన్ని ఇమ్ము పాడాడు. ఈ ఫెర్ఫామెన్స్ జరుగుతున్నంతసేపు కూడా వర్ష ఎమోషనల్ అయినట్లు కనిపించింది. కానీ బయటపడలేదు అనిపించింది. ఇక వర్ష స్టేజీపైకి వచ్చిన తర్వాత ‘ఏమైంది?’ అని జడ్జి ఇంద్రజ అడిగినప్పటికీ.. ఆమె మౌనంగానే ఉండిపోయింది. ‘అప్పటికి ఇప్పటికే మీ మధ్య ఏం మారలేదా?’ అని యాంకర్ రష్మీ అడగ్గా.. ‘అది ఎప్పటికీ మారదేమో అనిపించింది. అందుకే ఇలా..’ అని ఇమ్ము సమాధానమిచ్చాడు. దీన్నిబట్టి చూస్తుంటే వర్షని ఇమ్ము నిజంగా ప్రేమిస్తున్నాడా అనిపించింది. ఇకపోతే వీళ్లిద్దరూ ఇప్పటికీ మాట్లాడుకోవట్లేదని తెలుస్తోంది. ఏం జరిగింది తెలియాలంటే.. పూర్తి ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే.