ప్రతి ఏడాది ప్రముఖ టీవీ ఛానల్స్ వార్షికోత్సవ వేడుకలు నిర్వహిస్తుంటాయి. ఆ విధంగా ఈ ఏడాది కూడా జీ తెలుగు ఛానల్ యాజమాన్యం నిర్వహించిన 17వ యానివర్సరీ సెలబ్రేషన్స్ కి సంబంధించి తాజాగా ప్రోమో రిలీజ్ చేసింది. ఈ సెలబ్రేషన్స్ లో జీ ఛానల్ కి సంబంధించి అన్ని సీరియల్స్, ప్రోగ్రామ్స్ లో కనిపించే ఆర్టిస్టులు, యాంకర్స్ అందరూ పాల్గొన్నారు. అందరూ కూడా ఎవరి పెర్ఫార్మన్స్ స్టేజిపై ప్రదర్శించారు. అయితే.. ఈ యానివర్సరీ సెలబ్రేషన్స్ కి యాంకర్ శ్రీముఖి వ్యాఖ్యాతగా వ్యవహరించింది.
ఈ క్రమంలో అందరితో పాటు శ్రీముఖి కూడా ఆటాపాటలతో మెప్పించే ప్రయత్నం చేసింది. ఈ కార్యక్రమానికి ఎఫ్3 సినిమా బృందం కూడా హాజరై సందడి చేశారు. అయితే.. అందరి పెర్ఫార్మన్స్ చూసి శ్రీముఖి కూడా యష్ మాస్టర్ తో రెండు రొమాంటిక్ స్టెప్స్ వేసినట్లు ప్రోమోలో కనిపిస్తోంది. శ్రీముఖి – యష్ పెర్ఫార్మన్స్ అనంతరం.. యష్ భార్య సీరియస్ అయినట్లు తెలుస్తుంది. ఇక యష్ భార్య కోపాన్ని తగ్గించేందుకు ఓ సెలబ్రిటీ.. మీ ఆయన నిప్పు చెల్లమ్మా.. టెన్షన్ పడకు అని చెప్పడంతో కూల్ అయింది. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ అవుతోంది. మరి ఈ శ్రీముఖి – యష్ మాస్టర్ డాన్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.