టాలెంట్ ఎవరి సొత్తు కాదు.. ఇక్కడ ఎవడి జీవితంలో వాడే హీరో.. అనే మాటలు కొంతమంది ఎదిగిన విధానం చూస్తే నిజమే అనిపిస్తుంటాయి. అవును.. బయట ప్రపంచంలో ఏమోగానీ సినీ పరిశ్రమలో అవకాశాలు అందుకోవడం అంటే.. అదికూడా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా అనేది గొప్ప విషయంగానే భావించాలి. ప్రతి మనిషి సక్సెస్ అయ్యే జర్నీలో ఎంతమంది సహకారం ఉండొచ్చు. కానీ.. ఆ మనిషిలో టాలెంట్ లేకపోతే మాత్రం ఎవరూ సపోర్ట్ చేయరు అనేది వాస్తవం. ఇటీవల యూట్యూబ్, ఇన్ స్టాగ్రామ్ రీల్స్, షార్ట్ ఫిలిమ్స్.. ఇలా సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించుకొని సినిమాల్లో ఛాన్స్ అందుకుంటున్న ఎంతోమంది జనాలను సర్ప్రైజ్ చేస్తున్నారు.
సోషల్ మీడియా వేదికగానే చాలామంది సెలబ్రిటీ హోదా అందుకున్నారు.. అందుకుంటున్నారు. అలా సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చిన సెలబ్రిటీలలో వైష్ణవి చైతన్య ఒకరు. అందరిలాగే వైష్ణవి కూడా మొదట డబ్ స్మాష్ వీడియోలతో యాక్టింగ్ జర్నీ స్టార్ట్ చేసిన వైష్ణవి.. ఆ తర్వాత టిక్ టాక్ లో వీడియోలు చేసి మంచి క్రేజ్ తెచ్చుకుంది. అలా టిక్ టాక్ లో అప్పటికే పాపులర్ అయిన మెహబూబ్ దిల్ సేకి జోడిగా వీడియోలు చేసిన వైష్ణవి.. మెల్లగా ఇన్ స్టాగ్రామ్ లో వీడియోలు మొదలుపెట్టి.. మంచి ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది. ఇప్పుడు నడుస్తున్న కాలంలో సోషల్ మీడియా అనేది జనాలను ఎంతో ఇన్ ఫ్లుయెన్స్ చేస్తోంది. అలా వైష్ణవి జర్నీ కూడా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
ఇక సోషల్ మీడియాలో వైష్ణవి ఫాలోయింగ్ చూసి పాపులర్ ఇన్ఫినిటం మీడియా వారు.. ‘అల వైకుంఠపురంలో’ సినిమాలోని ‘సామజవరాగమన’ కవర్ సాంగ్ చేయించారు. అలా యూట్యూబ్ లో వైష్ణవి నుండి మొదటి యూట్యూబ్ వీడియో రిలీజ్ అయ్యింది. ఆ సాంగ్ బాగా పాపులర్ అవ్వడంతో.. యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్ సరసన ‘అబ్బనీ తీయని దెబ్బ’ కవర్ సాంగ్ చేసింది. ఆ సాంగ్ తో షణ్ముఖ్ – వైష్ణవిల జోడి బాగుందని అనిపించుకుంది. అనంతరం పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించి.. 2020లో అదే షణ్ముఖ్ సరసన ‘సాఫ్ట్ వేర్ డెవలవ్ పర్’ వెబ్ సిరీస్ చేసి సూపర్ క్రేజ్ సొంతం చేసుకుంది.
ఆ ఒక్క వెబ్ సిరీస్ తో వైష్ణవి ఫేట్ మారిపోయిందని చెప్పాలి. సోషల్ మీడియాలో హీరోయిన్ కి ఉన్న క్రేజ్ దక్కించుకుంది. దీంతో ఏకంగా అల వైకుంఠపురంలో మూవీలో అల్లు అర్జున్ కి చెల్లి పాత్రలో ఛాన్స్ అందుకుంది. ఆ తర్వాత వరుడు కావలెను, వలిమై లాంటి సినిమాలలో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేస్తూ వచ్చింది. కట్ చేస్తే.. ఇప్పుడు వైషూ ‘బేబీ’ అనే సినిమాలో హీరోయిన్. విజయవాడలో పుట్టి పెరిగిన వైషూ.. డబ్ స్మాష్ వీడియోల నుండి హీరోయిన్ గా ఎదిగిన విధానం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూనే.. ఎంతోమంది అప్ కమింగ్ యాక్టర్స్ కి స్ఫూర్తిగా నిలుస్తోంది. సాధారణ మధ్య తరగతి ఫ్యామిలీలో 1994 జనవరి 4న వైష్ణవి జన్మించింది. ఈమెకు పేరెంట్స్, ఓ తమ్ముడు నితీష్ చైతన్య ఉన్నారు.
సినీ ఇండస్ట్రీలో అవకాశాలు అందుకోవడానికి అమ్మాయిలు ఎలా ఇబ్బందులు పడుతున్నారో చూస్తూనే ఉన్నాం. ఇలాంటి తరుణంలో ఎన్నో ఆటుపోట్లు, అవమానాలు, కామెంట్స్ ఫేస్ చేసిన వైషూ.. హీరోయిన్ గా అవకాశం అందుకొని ఒక్కసారిగా షాకిచ్చింది. యూట్యూబ్ లో ఆల్రెడీ ఆమె ముఖం చూసి ఉండొచ్చు.. కానీ, సినిమా అనేది అందరి డ్రీమ్. అందుకే ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఫేస్ చేస్తూ ముందుకు వెళ్ళింది. హీరోయిన్ గా ఛాన్స్ అందుకుంది. హీరోహీరోయిన్లుగా ఎంతోమంది డెబ్యూ చేస్తుండవచ్చు. కానీ, అందరి లైఫ్ జర్నీలు అంత ఆసక్తికరంగా ఉండవు.
ఇండస్ట్రీలో ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా వెనుదిరిగిన వాళ్ళను ఎంతోమందిని చూశాం. కేవలం టాలెంట్ మాత్రమే ఎవరినైనా నిలబెట్టేది. అలా వైష్ణవి టాలెంట్.. ఇప్పుడు బేబీ సినిమాలో లీడ్ రోల్ తెచ్చిపెట్టిందని చెప్పవచ్చు. చూడాలి మరి.. మున్ముందు ఎన్నో మంచి పాత్రలు, మంచి సినిమాలు చేయాలని కోరుకుందాం. రీసెంట్ గా బేబీ మూవీ టీజర్ రిలీజై మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. హృద్యమైన ప్రేమకథతో ఈ సినిమా తెరకెక్కుతోందని టీజర్ చూస్తే అర్థమవుతుంది. కుడికన్ను అదిరితే మంచి, ఎడమకన్ను అదిరితే చెడు జరుగుతాయని బేబీ టీజర్ లో ఓ డైలాగ్ ఉంది. ఎడమకన్ను సంగతేమో గానీ, టీజర్ చూశాక వైష్ణవి ఫ్యాన్స్ అందరికి కుడికన్ను అదరటం ఖాయం అనిపిస్తుంది. చూడాలి మరి.. హృద్యమైన ప్రేమకావ్యంగా బేబీ సినిమాతో వైష్ణవి జర్నీ మరో మెట్టు ఎదగాలని కోరుకుందాం!