సినీ ఇండస్ట్రీలో ఫ్యాన్ వార్స్ అనేవి చాలా సహజం. ఎప్పుడు ఏ సినిమా వచ్చినా మా హీరో అంటే హీరో గొప్ప అని ఫ్యాన్స్ వాదించుకోవడం మనం చూస్తూనే ఉంటాం. అయితే.. తాజాగా నేచురల్ స్టార్ నాని – రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మధ్య ఓ సినిమా విషయంలో వార్ మొదలైనట్లు తెలుస్తుంది. ప్రస్తుతం నాని, విజయ్ కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఓవైపు నాని అంటే సుందరానికి, దసరా సినిమాలతో పాటు మరికొన్ని సినిమాలు లైనప్ చేసుకున్నాడు.
అదేవిధంగా విజయ్ కూడా పూరి జగన్నాథ్ తో లైగర్, జనగణమన సినిమాలు.. డైరెక్టర్ శివ నిర్వాణతో ఓ సినిమా లైనప్ చేసుకున్నాడు. ఈ క్రమంలో తాజాగా విజయ్ – శివ నిర్వాణ కాంబినేషన్ లో మూవీకి పూజా కార్యక్రమం జరిగింది. అయితే.. దర్శకుడు శివ నిర్వాణ.. విజయ్ తో తెరకెక్కించబోయే సినిమా కథను ఆల్రెడీ నాని రిజక్ట్ చేశాడని.. నాని రిజెక్ట్ చేశాకే విజయ్ దగ్గరికి వచ్చిందని నాని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారని ఇండస్ట్రీ టాక్.
మరోవైపు విజయ్ ఫ్యాన్స్ రెచ్చిపోతూ.. నానికి సరైన స్టోరీ సెలక్షన్ రాదని, అందుకే మంచి సినిమాలను మిస్ చేసుకుంటూ వరుస ప్లాప్ లను ఖాతాలో వేసుకుంటున్నాడని తిరిగి కామెంట్స్ చేసుకోవడం నెట్టింట చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఈ ఫ్యాన్స్ వార్ మెల్లగా ముదురుతున్నట్లుగా అనిపిస్తుందని.. ఇంకా ఎంతవరకు దారి తీస్తుందో అని అభిప్రాయాలు వెలువడుతున్నాయి. మరి నాని – విజయ్ ఫ్యాన్ వార్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.