Sivakarthikeyan: ప్రముఖ తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ వివాదంలో చిక్కుకున్నారు. కొరియన్ నటులపై ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఓ స్కూల్ ఫంక్షన్లో పాల్గొన్న ఆయన కొరియన్ హీరో, హీరోయిన్స్ లుక్స్‌పై కామెంట్లు చేశారు. ఆయన తాజా చిత్రం ‘డాన్’ సినిమాలో శివకార్తికేయన్, సూరీల మధ్య ఓ కామెడీ సీన్ ఉంటుంది. ఈ ఇద్దరూ కొరియన్ స్లాంగ్‌ను ఇమిటేట్ చేస్తూ తమిళంలో మాట్లాడుకుంటారు. అది అచ్చం కొరియన్లాగా అనిపిస్తుంది. దీనిపై శివకార్తికేయన్ మాట్లాడుతూ.. ‘‘ నాకు తెలిసిన కొరియన్ భాషంటే ‘డాన్’ సినిమాలో మాట్లాడిందే. నేను ఎప్పుడు కొరియన్ సినిమాలు చూసినా అందరూ ఒకేలా అనిపిస్తుంటారు. కొన్ని సార్లు ఎవరు హీరో? ఎవరు హీరోయిన్?
అన్నది తెలియకుండానే సినిమాలు చూశా. ఎప్పుడు కొరియన్ గురించి మాట్లాడినా.. నేను, సూరి అన్న మాట్లాడిన కొరియన్ గుర్తొస్తుంది. కొరియా వాళ్లు ఎవరైనా ఇది విన్నారంటే టెన్షన్ అవుతారు. ఇక, డాన్ సినిమాలోని ఆ కామెడీ సీన్ కొరియన్ సినిమాలనుంచి వచ్చినదే’’ అని అన్నారు. శివకార్తికేయన్ కామెడీ కోసం ఈ విధంగా మాట్లాడారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు కొందరు శివకార్తికేయన్‌పై ఫైర్ అవుతున్నారు. ‘‘ ఇతడు నిజంగా విషపూరితమైన వాడు. అతడి కామెడీ అంతా ఒకర్ని కించపరిచేలాగానే ఉంటుంది.
100 ఏళ్ల తమిళ సినిమాను వెనక్కు నెట్టేస్తున్నాడు’’.. ‘‘ సెలెబ్రిటీ లారా ఏదైనా మాట్లాడేటప్పుడు కొంత ఒళ్లు దగ్గరపెట్టుకోండి. మీ మాటలు, చేతలు కొందర్ని ఇబ్బంది పెట్టవచ్చు’’… ‘‘ దేవుడా! శివకార్తికేయన్ తాను ఎంత పెద్ద తప్పు చేశానో తెలుసుకున్నాడా. ఇతర దేశాల నటులు మన ఇండియన్ సినిమా గురించి నటుల గురించి ఇలానే మాట్లాడితే ఎలా ఉంటుంది. మనం చేసేదంతా కామెడీ కాదు. పబ్లిక్‌లో ఎలా మాట్లాడాలో నేర్చుకోండి!’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి, కొరియన్ హీరో,హీరోయిన్స్‌పై తమిళ హీరో శివకార్తికేయన్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Sivakarthikeyan mocks Korean language (based on that racist “comedy” sequence from Don), says all koreans look alike, and their women look like men.
All these in an event at a school, in front of kids!
Our celebrities badly need to attend special sensitisation workshops! pic.twitter.com/oDfaPkm35t
— 🐦 Birdman (@amabirdman) September 15, 2022
ఇవి కూడా చదవండి : The Ghost Movie: చిత్రీకరణలో హీరోయిన్ కి గాయాలు.. అయినా సరే