సినిమా షూటింగ్ అంటే చాలా శ్రమతో కూడుకున్నది. చిన్నచిన్న పొరపాట్లు జరుగుతున్నా సరే దాన్ని విజయవంతంగా పూర్తి చేస్తుంటారు. ఇక సినిమా, థియేటర్లలోకి వచ్చి హిట్ అయితే.. చిత్రబృందం తాముపడిన కష్టం మర్చిపోతుంది. ఇక ఫైట్ సీన్స్ అంటే ఎంత డూప్స్ ని పెట్టినా మేనేజ్ చేసినా సరే కొన్నిసార్లు రియల్ గా రంగంలోకి దూకాల్సి ఉంటుంది. అలాంటప్పుడు నటీనటులకు గాయాలవుతుంటాయి. ఇప్పుడు కూడా సేమ్ అలానే నాగ్ హీరోయిన్ కి గాయాలైంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ ఫొటో వైరల్ గా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. సోనాల్ చౌహాన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలయ్యతో లెజెండ్, లయన్ తదితర సినిమాల్లో హీరోయిన్ గా చేసిన సోనాల్.. మిగతా హీరోలతోనూ పలు సినిమాలు చేసింది. ప్రస్తుతం కింగ్ నాగార్జున ‘ఘోస్ట్’లో హీరోయిన్ గా చేస్తోంది. ఈ క్రమంలోనే ఆమె వర్క్ డెడికేషన్ గురించి ఓ విషయం బయటకొచ్చింది. సినిమా షూటింగ్ సమయంలో ఓ అనుహ్య సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్ కోసం ప్రాక్టీసు చేస్తుండగా, సోనాల్ కాలు విరిగిందట. దీంతో ఆరు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. మరీ ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్ దూరంగా ఉండాలని చెప్పారట.
మరోవైపు ‘ఘోస్ట్’ చిత్రాన్ని దసరాకు విడుదల చేస్తామని నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. దీంతో ఎలాగైనా సరే ఈ సీన్స్ పూర్తిచేయాలని, ఫ్రాక్చర్ అయిన కాలితోనే సోనాల్ చౌహాన్ షూటింగ్ పూర్తి చేసిందట. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో ఈ విషయం కాస్త బయయకొచ్చింది. ఇక దిల్లీలో పుట్టిపెరిగిన సోనాల్.. మోడల్ గా కెరీర్ ప్రారంభించింది. హిందీలో ‘జన్నత్’లో హీరోయిన్ గా చేసి, తెలుగులో ‘రెయిన్ బో’తో ఎంట్రీ ఇచ్చింది. మరి గాయమైనా సరే సోనాల్ షూటింగ్ లో పాల్గొనడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
ఇదీ చదవండి: మగాళ్ళపై డబుల్ మీనింగ్ జోక్ పేల్చిన రెజీనా! ఆ విషయంలో రెండు నిమిషాలకి మించి నిలబడలేరంటూ..