‘బిగ్ బాస్ తెలుగు ఓటీటీ’ సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది. బిగ్ బాస్ కార్యక్రమానికి అన్ని భాషల్లో మంచి ఆదరణ ఉంది. తెలుగులో కూడా బాగా హిట్ అయిన షో అది. రెగ్యులర్ సీజన్ కాకుండా ఇప్పుడు ఓటీటీ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఆ షో ఎంత పాపులరో.. ఆ హౌస్ కి వెళ్లి వచ్చిన వాళ్లు కూడా అంతే ఫేమస్ అవుతారు. అక్కడ అడుగుపెట్టి వచ్చిన వాళ్ల జీవితాల్లో ఎన్నో మార్పులు వస్తాయి. కొందరికి మంచిగా అయితే మరికొందరికి చెడుగా. అయితే సిరి హన్మంతుకు మాత్రం మిశ్రమ ఫలితాలు ఇచ్చిందనే చెప్పాలి. షణ్ముఖ్ తో ఫ్రెండ్‌షిప్ అటు షణ్నూకి ప్రేమను దూరంచేస్తే.. ఇటు సిరికి పేరు పాడు చేసింది.
ఇదీ చదవండి: బర్త్‌డే రోజు ఆర్జీవీకి షాకు.. కోట్లలో మోసం.. కోర్టు నోటీసులు..
బిగ్ బాస్ నుంచి తిరిగి వచ్చాక షణ్ముఖ్– దీప్తీ సునైనా బ్రేకప్ చెప్పుకున్నాక అందరూ సిరినే కారణం అంటూ కామెంట్ చేశారు. ఇంకొంత కాలం సిరి- శ్రీహాన్ కూడా విడిపోతున్నారంటూ ప్రచారాలు చేశారు. అయితే వారి మధ్య రిలేషన్ కొనసాగుతూనే ఉంది. కాకపోతే బయట వాళ్లిద్దరూ కలిసి కనిపించింది లేదు. తాజాగా ఇద్దరూ ఓ పార్టీలో కలిసి దిగిన పిక్ ను సిరి తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ‘తనే నా ఏకైక ప్రేమ.. నా పక్కనే ఉంటూ నా మంచి, చెడు అన్ని సందర్భాల్లో నా పక్కన నిలబడ్డాడు. నా బలం, నా మార్గదర్శి, నా గార్డియన్, నా సర్వస్వం’ అంటూ సిరి ఫొటో షేర్ చేసింది. ప్రస్తుతం ఆ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సిరి పోస్ట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.