Noel Sean: ప్రముఖ సింగర్, బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ నోయెల్ ఇంట్రో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం మరణించారు. ఈ విషయం తెలిసి సింగర్ రాహుల్ సిప్లిగంజ్ సహా పలువురు టాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
కాగా, నోయెల్ ర్యాప్ సింగర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. నోయెల్ సింగర్‌గానే కాకుండా నటుడిగానూ పలు సినిమాల్లో నటించాడు. బిగ్‌బాస్ తెలుగు సీజన్-3లో కంటెస్టెంట్‌గానూ పాల్గొని అందరినీ ఆకట్టుకున్నాడు. మరి, నోయెల్ తండ్రి మరణంపై మీ సంతాపాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.