తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన అనతి కాలంలోనే టాప్ హీరోయిన్ ఎదిగిపోయిన హీరోయిన్ శ్రుతిహాసన్. టాలీవుడ్ లోని టాప్ హీరోలందరితోనూ నటించి మంచి మార్కులే కొట్టేసింది. అయితే తన అందం, అభినయంతో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ సూపర్ హిట్ చిత్రాల్లో సైతం నటించి ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ అందాల సుందరి చేతినిండా సినిమాలతో తెగ బిజీగా మారిపోయింది. ఇకపోతే శ్రుతిహాసన్ సోషల్ మీడియాలో కాస్త యాక్టివ్ గానే ఉంటూ ఫ్యాన్స్ తో టచ్ లో ఉండేందుకు ప్రయత్నిస్తుంటుంది.
అయితే తాజాగా ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేసింది. ఇదే పోస్ట్ కాస్త వైరల్ గా కూడా మారుతోంది. విషయం ఏంటంటే? ఢిల్లీకి చెందిన చిత్రకారుడు శాంతను హజరికతో శ్రుతిహాసన్ ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే గతంలో ఆమె పాల్గొన్న ఇంటర్వ్యూల్లో ఆమె ప్రియుడి గురించి చెప్పుకుంటూ వచ్చింది. శాంతను తనకు మంచి స్నేహితుడంటూ తెలిపింది.
కాగా తాజాగా శ్రుతిహాసన్ శాంతనుతో ఉన్న ఓ వీడియోను అప్ లోడ్ చేస్తూ.. నువ్వెప్పటికీ నాకు విచిత్రమే అంటూ ఇంట్రెస్టింగ్ గా రాసుకొచ్చింది. ఇదే వీడియో ఇప్పుడు నెట్టింట్లో కాస్త వైరల్ గా మారుతోంది. ఇదిలా ఉంటే శ్రుతిహాసన్ ఇప్పుడు చేతి నిండా సినిమాలతో కాస్త బిజీ బిజిగా గడుపుతోంది. ప్రభాస్ హీరోగా వస్తున్న సలార్ చిత్రంతో పాటు చిరంజీవి, బాలయ్య సినిమాల్లో సైతం ఈ హీరోయిన్ నటిస్తోంది. శ్రుతిహాసన్ తాజాగా చేసిన ఈ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.