Shruti Haasan: లోకనాయకుడు కమల్ హాసన్ కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు శృతిహాసన్. తక్కువ టైంలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. నటిగా, మ్యూజిక్ డైరెక్టర్‌గా, సింగర్‌గా ఇలా బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించారు. తండ్రికి తగ్గ కూతురు అనిపించుకున్నారు. కెరీర్ మంచి ఫామ్‌లో ఉండగానే ఇంగ్లాండ్ గాయకుడు మైకేల్ కోర్సలేతో ప్రేమలో పడ్డారు. ఈ ఇద్దరూ కొన్నేళ్లు డేటింగ్ కూడా చేశారు. అయితే, ఏవో కారణాల వల్ల విడిపోయారు. ఆ బాధతో ఆమె కొన్నేళ్లు సినిమాలకు దూరమయ్యారు. ఆ బాధనుంచి కోలుకున్న వెంటనే శాంతను హజారి అనే డూడుల్ ఆర్టిస్టుతో ప్రేమలో పడ్డారు. ప్రస్తుతం వీరిద్దరు పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతున్నారు. ప్రేమ విషయం పక్కన పెడితే.. సినిమాలపై కూడా ఫుల్ ఫోకస్‌గా ఉన్నారు శృతిహాసన్.
మంచి కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్- ప్రభాస్ కాంబినేషన్‌లో వస్తున్న ‘సలార్’లో హీరోయిన్‌గా చేస్తున్నారు. షూటింగులనుంచి ఖాళీ దొరికిన సమయాల్లో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. అభిమానుల కోసం చిట్‌చాట్ లాంటి వాటిలో కూడా పాల్గొంటున్నారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తున్నారు. తాజాగా, ఓ అభిమాని అడిగిన తిక్క ప్రశ్నకు ఆమె తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. సదరు అభిమాని ‘‘ మీ పెదాల సైజ్ ఎంత ’’ అని అడిగాడు. దీనికి రిప్లైగా ‘పెదాల సైజ్ కూడా ఉంటుందా? అయితే ఇదిగో నువ్వే చూసుకుని కొలుచుకో’ అంటూ తన పెదాలను ముడిచిన ఓ ఫొటో పెట్టారు. శృతి రిప్లై ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. శృతి హాసన్ రిప్లై పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.ఇవి కూడా చదవండి : KGF చాప్టర్ 2తో ఆగలేదు.. పార్ట్ 3 కూడా!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి