సినిమా ఇండస్ట్రీ అన్నాక హీరోయిన్స్ కి అందాల ఆరబోత అనేది మామూలే. కానీ కొందరు హీరోయిన్స్ ఉంటారు. అందాల పారబోతే లక్ష్యంగా, అందంతో ఉక్కపోత పెంచడమే ధ్యేయంగా జీవిస్తుంటారు. అలాంటి వారిలో టాలీవుడ్ బోల్డ్ బ్యూటీ శ్రియా సరన్ ఒకరు. మామూలుగా సినిమాల్లో కొంచెం రొమాంటిక్ గా కనబడితేనే కుర్రాళ్ళు తట్టుకోలేరు. అలాంటిది ఈ మధ్య సోషల్ మీడియా వేదికగా హాట్ హాట్ ఫోటోలు, బోల్డ్ పిక్స్ షేర్ చేస్తూ పిచ్చెక్కిస్తోంది. గడ్డ కట్టే చలిలో కూడా ఉష్ణోగ్రత పెంచేసి చెమటలు పెట్టించగల అందంతో శ్రియా మతిపోగొడుతోంది. ఈ వేడి తట్టుకోలేక మన శ్రియా సరన్ అందాల వీధి కుర్రాళ్లంతా స్వెట్టర్లు తీసేసి తిరుగుతుంటే.. శ్రియా ఏకంగా బట్టలు తీసేసింది.
టాప్ తీసేసి టాప్ లేపేసింది. బట్టలు విప్పేసి బుర్ర పాడు చేసేసింది. ఎందుకోసం ఇదంతా అంటే ఒక యాడ్ కోసమని అంట. వీనస్ స్ప్లాష్ ప్రో టీవీసీ కంపెనీ ఉత్పత్తి అయిన బాత్ వాటర్ హీటర్ కోసం ఒక ప్రకటనలో నటించింది. ఈ ప్రకటన కోసం ఒంటి మీద నూలు పోగు లేకుండా నటించింది. షవర్ కింద నిలబడి సోయగాలను చూపిస్తూ కనువిందు చేసింది. వాటర్ హీటర్ ఉత్పత్తులని ప్రమోట్ చేస్తుందో లేక తన సోయగాలను ప్రమోట్ చేసుకుంటుందో అర్ధం కాని పరిస్థితిలో ఉన్నారు కుర్రాళ్ళు. అటు కంపెనీ, ఇటు శ్రియ ఇద్దరూ తమ లక్ష్యాన్ని చేరుకున్నట్టే ఈ ప్రకటనతో. షోరూం బండిలా కొత్తగా మెరిసిపోతుంది శ్రియ.
ఇది చూసిన నిర్మాతలకి, దర్శకులకి శ్రియాకి అవకాశాలు ఇవ్వకుండా తప్పు చేశామేమోరా అని కుమిలిపోయేలా చేసింది. ప్రస్తుతం శ్రియ నటించిన ఈ ప్రకటన వీడియోకి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. యూట్యూబ్ లో ఈ వీడియో కోసం వెతుకులాట సాగిస్తున్నారు. ఇక శ్రియ నటించిన బాలీవుడ్ మూవీ ‘దృశ్యం 2’ ఈ 17న రిలీజ్ కాబోతుంది. మరోవైపు హిందీ, తెలుగు భాషల్లో తెరకెక్కిన మ్యూజిక్ స్కూల్ అనే సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. ప్రస్తుతం ఉపేంద్ర హీరోగా తెరకెక్కుతున్న కబ్జా అనే కన్నడ సినిమాలో నటిస్తోంది. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ.. సోషల్ మీడియాలో కూడా సెగలు పుట్టించే రేంజ్ లో ఫోటోలు షేర్ చేస్తుంది. రెగ్యులర్ గా యాక్టివ్ గా ఉంటూ నేనున్నాను అని అందరికీ గుర్తు చేస్తుంటుంది.