దేశవ్యాప్తంగా పాపులర్ అయినటువంటి రియాలిటీ షోలలో బిగ్ బాస్ ఒకటి. హిందీలో మొదటగా ప్రారంభమైన ఈ రియాలిటీ షో.. కొన్ని సీజన్లుగా దక్షిణాది భాషల్లో కూడా కొనసాగుతోంది. ముఖ్యంగా తెలుగులో ఐదు సీజన్లు పూర్తిచేసుకున్న బిగ్ బాస్.. ఇప్పుడు 6వ సీజన్ కంటిన్యూ చేస్తోంది. మరోవైపు హిందీ బిగ్ బాస్ విషయానికి వస్తే.. ఇప్పటివరకు పదిహేను సీజన్లు విజయవంతంగా కంప్లీట్ చేసుకొని.. ఇప్పుడు 16వ సీజన్ కోసం రెడీ అవుతోంది. అయితే.. సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరించనున్న బిగ్ బాస్ 16లో కంటెస్టెంట్ గా ఓ బాలీవుడ్ డైరెక్టర్ పాల్గొనడం పెద్ద చర్చకు దారితీసింది. బిగ్ బాస్ సీజన్ 16లో డైరెక్టర్ సాజిద్ ఖాన్ సభ్యుడిగా పాల్గొన్న విషయం తెలిసిందే.
దీంతో అతనిపై పలువురు బాలీవుడ్ హీరోయిన్స్ దుమ్మెత్తిపోస్తున్నారు. బాలీవుడ్ మీటూ ఉద్యమంలో భాగంగా గతంలోనే సాజిద్ ఖాన్ పై కొందరు హీరోయిన్స్, క్యారెక్టర్ ఆర్టిస్టులు లైంగిక ఆరోపణలు నమోదు చేశారు. ఈ క్రమంలో ఇప్పుడతను బిగ్ బాస్ లో అడుగు పెట్టేసరికి.. ఇండస్ట్రీలో మహిళల పట్ల లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తిని ఎలా హౌస్ లోకి రానిచ్చారని సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే సాజిద్ ఖాన్ ని వెంటనే బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి పంపించేయాలని హీరోయిన్స్ మందన కరిమి, సోనా మహాపాత్ర, ఉర్ఫీ జావేద్, నేహా భసిన్ తో పాటు మరికొంతమంది యాజమాన్యాన్ని, హోస్ట్ సల్మాన్ ఖాన్ ని రిక్వెస్ట్ చేయడం గమనార్హం.
ఇదే విషయంపై హీరోయిన్ షెర్లిన్ చోప్రా సైతం సోషల్ మీడియా వేదికగా స్పందించింది. సాజిద్ ఖాన్ ని బిగ్గెస్ట్ రియాలిటీ షోలోకి సభ్యుడిగా రానివ్వడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు చెబుతూ అతనిపై సంచలన ఆరోపణలు చేసింది. గతంలో సాజిద్ ప్రైవేట్ పార్ట్ ని తనకు చూపించి 0-10 వరకు రేటింగ్ అడిగాడని చెప్పిన షెర్లిన్.. ఇప్పుడు తాను బిగ్ బాస్ లోకి ఎంటరై అతనికి రేటింగ్ ఇవ్వాలని అనుకుంటున్నట్లు తెలిపింది. అలా అసభ్యంగా ప్రవర్తించిన సాజిద్ ఖాన్ ని వెంటనే షో నుండి తొలగిస్తే బాగుంటుందని షెర్లిన్ చోప్రా.. సల్మాన్ ఖాన్ ని ట్యాగ్ చేసింది. ప్రస్తుతం షెర్లిన్ చోప్రా చేసిన ట్వీట్ బాలీవుడ్ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది. మరి సాజిద్ ఖాన్ పై వస్తున్న విమర్శలు, వ్యతిరేకతపై బిగ్ బాస్ యాజమాన్యం, హోస్ట్ సల్మాన్ ఖాన్ ఎలా స్పందిస్తారో చూడాలి.
He had flashed his private part at me & asked me to rate it on a scale of 0 to 10. I’d like to enter into the house of Big Boss & give him the rating!
Let 🇮🇳 watch how a survivor deals with her molester!Pls take a stand! @BeingSalmanKhan
Read more at: https://t.co/j8kPljB1s6
— Sherlyn Chopra (शर्लिन चोपड़ा)🇮🇳 (@SherlynChopra) October 10, 2022
When I had met him in April 2005, a few days after my father’s demise, he had taken his penis out of his pants and had asked me to feel it.
I remember having told him that I know how a penis feels like & that the purpose of my meeting with him was not to feel or rate his penis.. https://t.co/2gnGSdEIrU— Sherlyn Chopra (शर्लिन चोपड़ा)🇮🇳 (@SherlynChopra) January 18, 2021
I kept thinking all these years @whitespeaking to talk about this a## @SimplySajidK and what stopped me was that nobody would listen. He did exactly the same with me while he was casting for Himmatwala. Called me to his juju house and asked me to strip. https://t.co/BSNnMFjv9K
— Simran Kaur Suri (@29simran) October 12, 2018
View this post on Instagram
A post shared by Sherlyn Chopra (शर्लिन चोपड़ा) Official Account (@_sherlynchopra_)