వెండితెర అంటే ఓ రంగుల ప్రపంచం అని అంటుంటటారు.. అయితే ఎంతో మంది సినీ సెలబ్రెటీలు తెరపై ఆనందంగా, సంతోషంగా కనిపించినా.. నిజ జీవితంలో ఎన్నో బాధలు, కష్టాలు అనుభవించామని పలు సందర్భాల్లో చెబుతున్న విషయం తెలిసిందే.
వెండితెర చాలా మంది రంగుల ప్రపంచం అని అనుకుంటారు. ఒక్కసారి వెండితెరపై కనిపిస్తే సెలబ్రెటీ హోదా వస్తుంది.. సొసైటీలో ప్రత్యేక గుర్తింపు వస్తుందని భావిస్తుంటారు. అయితే సెలబ్రెటీలకు కష్టాలు.. కన్నీళ్లు ఉంటాయని ఎంతో మంది తమ అనుభవాలు మీడియా వేధికగా వెల్లడించారు. 2002 లో “కాంటా లగా” వీడియో ఆల్బం తో ఓవర్ నైట్ స్టార్ అయింది షెఫాలీ జరివాలా. తన బాల్యంలో ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. వివరాల్లోకి వెళితే..
2002 లో 2002 లో మ్యూజిక్ వీడియో ‘కాంతా లగా’ తో కోట్ల మంది అభిమానులను ఫిదా చేసింది. ఒక్క వీడియో ఆల్బంతో ఓవర్ నైట్ స్టార్ అయ్యింది షెఫాలీ జరివాలా. 1975 లో వచ్చిన పాటకు రిమిక్స్ గా తెరకెక్కించిన ఈ సాంగ్ లో షెఫాలీ జరివాలా మత్తెక్కించే అందాలతో కుర్రాళ్ల మతులు పోగొట్టింది. ఆ తర్వాత పలు మ్యూజిక్ ఆల్బాన్స్ లో నటించింది. ఆ మద్య బాలీవుడ్ లో వస్తున్న బిగ్ బాస్ రియాల్టీ షోలో కూడా పాల్గొంది. తన బాల్యంలో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘15 ఏళ్ల వయసులో నాకు మూర్చ వ్యాధి వచ్చింది. హఠాత్తుగా మూర్చతో నేను కిందపడిపోతే చాలా మంది విచిత్రంగా చూసేవారు. ఆ వ్యాధి నన్ను పదేళ్ల పాటు వెంటాడింది. మూర్చ వ్యాధితో జీవించడం అనేది ఒక ఛాలెంజ్ అని చెప్పొచ్చు. ఒక్కోసారి నేను ఒంటరిగా జనాల్లోకి వెళ్లాలంటే భయపడేదాన్ని.
జీవితంలో నేను ఎదుగుతున్న సమయంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాను.. ఎక్కడ పడితే అక్కడు.. ఎప్పుడు పడితే అప్పుడు హఠాత్తుగా మూర్చ వచ్చి పడిపోతానేమో అని భయంతో వణికిపోయేదాన్ని.. కొన్నిసార్లు నేను చాలా ఒత్తిడికి గురయ్యేదాన్ని.. కాంటా లగా షూటింగ్ చేస్తున్నప్పుడు లోకేషన్స్ కి వెళ్తుంటే సడెన్ గా మూర్చ వస్తుందేమో అని తెగ భయపడిపోయేదాన్ని.. కానీ ఇప్పుడు పరిస్థితులు అన్నీ చక్కదిద్దుకున్నాయి. మెడిసెస్ వల్ల నా ఆరోగ్యం చాలా వరకు నయమైంది. పదిహేనేళ్లుగా నాకు మూర్చరావడం లేదు.. మానసికంగా, శారీరకంగా ధృడంగా ఉన్నా అని తెలిపింది షెఫాలీ జరివాలా. ఈ అమ్మడు సల్మాన్, అక్షయ్ నటించిన ‘ముఝ్సే షాదీ కరోజి’ అనే బాలీవుడ్ చిత్రంలో నటించింది. ఆ తర్వాత తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి డ్యాన్స్ రియాల్టీ షో నాచ్ బలియే 5, 7 సీజన్స్‌లోనూ మెరిసింది.