సినీ ఇండస్ట్రీ అంటేనే రిలేషన్ షిప్, డేటింగ్ లాంటివి చాలా సాధారణం. ఆ హీరో ఈ హీరోయిన్ తో డేటింగ్ చేస్తున్నాడు, వీళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటారు, ఈ హీరో కొడుకు లేదా కూతురు త్వరలో హీరో/హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తారు. ఇలా ఏదో ఓ టాపిక్ నడుస్తూనే ఉంటుంది. ఇక హీరోల ఫ్యామిలీ గురించి ఏ చిన్న విషయం బయటకొచ్చినా సరే దాని గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తారు. ఇప్పుడు అలాంటి ఓ విషయాన్నే స్టార్ హీరో భార్య బయటపెట్టింది. తన కుమార్తె డేటింగ్ విషయంలోనూ సలహా ఇస్తానని మొహమాటం లేకుండా చెప్పేసింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ మధ్య అంటే సరైన హిట్ లేక ప్రభావం చూపించడం లేదు గానీ ఒకప్పుడు షారుక్ సినిమా అంటే ఫ్యాన్స్, ఆనందంతో ఉబ్బితబ్బిబ్బి అయిపోయేవారు. ఆయన భార్య గౌరీఖాన్ గురించి చాలామందికి తెలుసు. సెలబ్రిటీ ఇంటీరియర్ డిజైనర్ గా పేరు సంపాదించింది. ఇక వీళ్ల పిల్లలు ఆర్యన్, సుహానా, అబ్ రామ్ కూడా సోషల్ మీడియాలో ఏదో ఓ టాపిక్ లా ఉంటూనే ఉంటారు. తాజాగా ‘కాఫీ విత్ కరణ్’ ప్రోగ్రాంలో పాల్గొన్న గౌరీఖాన్.. తన కుమార్తె డేటింగ్ కి వెళ్తానంటే, అప్పుడు తనకి సలహా ఇవ్వాల్సి వస్తే మాత్రం ఒకేసారి ఇద్దరితో వెళ్లొద్దని మాత్రం చెబుతానని గౌరీ క్లారిటీ ఇచ్చింది.
ఇక తన పెళ్లి గురించి కూడా చెప్పిన గౌరీ ఖాన్.. ‘తమ వివాహం చాలా గందరగోళంగా, విచిత్ర సంఘటనల మధ్య జరిగింది. అది చూస్తే షారుక్ నటించిన ‘దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే’ గుర్తొస్తుంది’ అని చెప్పింది. ఈ మధ్య నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన ‘ఫ్యాబులస్ లైవ్స్ ఆఫ్ బాలీవుడ్ వైవ్స్’ అనే రియాలిటీ షోలో గౌరీ కనిపించింది. ఈ షోలో బాలీవుడ్ సెలబ్రిటీల భార్యల లైఫ్ స్టైల్ ని చూపించారు. ఇప్పటివరకు రెండు సీజన్లు ప్రసారం కాగా.. అందులో గౌరీ కొన్ని కొన్ని ఎపిసోడ్స్ లో కనిపించింది. మరి సుహానా డేటింగ్ కి తల్లి గౌరీ సలహా ఇవ్వడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
ఇదీ చదవండి: ఆ హీరోయిన్ తో డేటింగ్ లో ప్రభాస్! నిజమేనా?