షారుఖ్‌ఖాన్ వెండితెరపై కనిపించి మూడేళ్లు అవుతోంది. ‘జీరో’ పరాజయం తర్వాత కథల ఎంపికలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారాయన. సినిమాలను గ్రాండియర్‌గా తెరకెక్కించే దర్శకుల్లో సంజయ్ లీలా భన్సాలీ ఒకరు. ఈయన దర్శకుడితో బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్ సినిమా చేయబోతున్నారంటూ సినీ వర్గాల సమాచారం. వివరాల్లోకి వెళితే.. సంజయ్ లీలా భన్సాలీ, షారూక్ ఖాన్ కాంబినేషన్‌లో దాదాపు పందొమ్మిదేళ్ల ముందు, అంటే 2002లో ‘దేవదాస్’ సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వీరి కాంబినేషన్‌లో సినిమా రాలేదు. అయితే ఇప్పుడు ‘ఇజార్’ అనే ప్రేమ కోసం షారూక్, భన్సాలీ కలిసి పనిచేయబోతున్నారని, చర్చలు జరుగుతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రేయసి కోసం ఇండియా నుంచి నార్వేకు సైక్లింగ్ చేసిన వ్యక్తి నిజ జీవితం స్ఫూర్తిగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారట. ప్రస్తుతం షారూఖ్ హీరోగా సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘పఠాన్’ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో దీపికా పదుకోన్ హీరోయిన్. తాజా సమాచారం ప్రకారం అగ్ర దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీతో పంతొమ్మిదేళ్ల విరామం తర్వాత షారుఖ్‌ఖాన్ ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. భారతీయ వ్యక్తికి, నార్వే మహిళకు మధ్య సాగే ప్రేమ కథ ఇదని తెలిసింది. ఇందులో ప్రియురాలిని అన్వేషిస్తూ సైకిల్‌పై నార్వేకు ప్రయాణం సాగించే ప్రేమికుడిగా షారుఖ్‌ఖాన్ కనిపించబోతున్నట్లు చెబుతున్నారు. ఈ సినిమాకు ‘ఇజార్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. నిజజీవిత గాథ ఆధారంగా దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ ఈ కథను సిద్ధం చేసినట్లు తెలిసింది.