Sunandha: ఇండస్ట్రీ సినీనటుల నుండి సీరియల్ ఆర్టిస్టుల వరకూ ఒక్కొక్కరుగా తమ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెబుతున్నారు. ముఖ్యంగా బుల్లితెరపై అలరిస్తున్న సెలబ్రిటీలు ఇంతకాలం సింగిల్ లైఫ్ ని ఎంజాయ్ చేసి.. ఇప్పుడిప్పుడే ప్రేమించివారితో పెళ్లి పీటలెక్కుతున్నారు. ఇటీవలే జబర్దస్త్ కమెడియన్ కిరాక్ ఆర్పీ తన ప్రేయసితో నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా పాపులర్ సీరియల్ నటి సునంద మలసెట్టి ప్రేమించిన వ్యక్తితో ఎంగేజ్మెంట్ జరుపుకుంది.
కొన్నిరోజుల కిందటే తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లాడనున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించిన సునంద.. ఇటీవలే ఎంగేజ్మెంట్ చేసుకొని అందరినీ సర్ప్రైజ్ చేసింది. అలాగే తనకు కాబోయే భర్త పేరు శంకర్ అని తెలిపింది. ఇక ప్రస్తుతం సునంద ఎంగేజ్మెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. మరోవైపు తన సొంత యూట్యూబ్ ఛానల్ లో ఎంగేజ్మెంట్ కి సంబంధించి పూర్తి వీడియోలు షేర్ చేసింది. ప్రస్తుతం సునంద ఎంగేజ్మెంట్ ఫోటోలు, వీడియోలు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.
ఇదిలా ఉండగా.. వైజాగ్ లో పుట్టి పెరిగిన సునంద.. ప్రస్తుతం హైదరాబాద్ లో సెటిల్ అయినట్లు తెలుస్తుంది. ఎంవిఆర్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన సునందకి డాన్సింగ్ అంటే చాలా ఇష్టమట. అనంతరం చిన్న చిన్న రోల్స్ ద్వారా సీరియల్స్ లో అడుగుపెట్టిన సునంద.. జీ తెలుగు, ఈటీవీ సీరియల్స్ లో మంచి పాపులారిటీ దక్కించుకొని టీవీ ప్రేక్షకులకు దగ్గరైంది. ఇక ముద్దమందారం సీరియల్ లో విలన్ పాత్రకు మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. మరి పెళ్లి పీటలెక్కనున్న సునంద గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
View this post on Instagram
A post shared by SunandhaMala Setti_Official👸 (@sunandhamalasetti_official)