సాధారణంగా స్త్రీలకు మాతృత్వం అనేది ఎంతో గౌరవాన్ని తీసుకొస్తుంది. స్త్రీలు కూడా మాతృత్వాన్ని, గర్భం దాల్చడాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తుంటారు. ముఖ్యంగా భారతీయ స్త్రీలలో మాతృత్వాన్ని గౌరవించే లక్షణాలు ఎక్కువగా చూస్తుంటాం. అయితే.. పాశ్చాత్య సంస్కృతులు తెరపైకి వచ్చేసరికి.. ఆయా పద్ధతులకు అలవాటు పడిపోతున్నారు నేటితరం మహిళలు. ఈ పద్దతి కేవలం సినీ సెలబ్రిటీలలోనే కాదు.. మామూలు జనాలలో కూడా కనిపిస్తోంది. పెళ్లి, ప్రెగ్నన్సీ అనేవి స్త్రీ జీవితంలో ఎంతో ముఖ్యమైన క్షణాలు. అలాంటిది వాటిపైనే కామెడీ చేస్తే.. ఎవరు ఊరుకున్నా సోషల్ మీడియాలో నెటిజన్స్.. ప్రేమ, పెళ్ళికి వాల్యూ ఇచ్చేవారు ఊరుకోరు.
ఇటీవల సీరియల్ నటి కనిష్క సోని భర్త లేకుండానే గర్భం దాల్చిందంటూ వార్తలు గుప్పుమన్నాయి. కనిష్క సోనీ గురించి సీరియల్స్ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. ఇటీవల ఎదుటివాళ్లను ప్రేమించడం కన్నా తమని తామే ప్రేమించుకొని పెళ్లి చేసుకోవడం బెటర్ అని భావిస్తున్నారు కొంతమంది అమ్మాయిలు. అందుకే ఎవరినీ ప్రేమించకుండా.. అంటే ఏ అబ్బాయిని లవ్ చేయకుండా తమని తామే పెళ్లి కూడా చేసుకుంటున్నారు. అలాంటి వారినే సోలోగామి అంటారట. అలా తనని తాను పెళ్లి చేసుకొని.. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టి.. సోలోగామిగా పరిచయమైంది కనిష్క.
ఈ క్రమంలో ఈమెపై ప్రెగ్నన్సీ వార్తలు వైరల్ అయ్యాయి. ఈ మధ్య కనిష్క కాస్త లావుగా మారిన ఫోటోలు నెట్టింట ప్రత్యక్షమయ్యాయి. దీంతో అందరూ పెళ్లి తర్వాత లావు అయ్యింది కదా.. ఖచ్చితంగా ప్రెగ్నన్సీ అయ్యుంటుందని ఫోటోలు వైరల్ చేశారు. అదీగాక తనని తాను పెళ్లి చేసుకున్న కనిష్క.. వేరే ఎవరితోనైనా గర్భం దాల్చి ఉంటుందని.. ఇప్పట్లో ఇదంతా కామన్ గా చూస్తున్నారు కదా అనే కామెంట్స్ కూడా వినిపించాయి. దీంతో ఈ వార్తలు అక్కడా ఇక్కడా చేరి ఆఖరికి కనిష్క చెవిన పడ్డాయి. వెంటనే స్పందించిన ఈ బుల్లితెర బ్యూటీ.. “నన్ను నేను పెళ్లాడాక ప్రెగ్నన్సీ ఎందుకు వస్తుంది.. భర్త లేకుండా ఎలా ప్రెగ్నన్సీ అని ఎలా భావిస్తున్నారు. కేవలం పిజ్జాలు, బర్గర్లు బాగా తిని కాస్త లావయ్యాను అంతే!” అని చెప్పుకొచ్చింది కనిష్క. ప్రస్తుతం కనిష్క మాటలు సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతున్నాయి.