టీమిండియా మాజీ క్రికెటర్, డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటారన్న సంగతి తెలిసిందే. పలు అంశాలపై ట్వీట్టర్‌లో స్పందిస్తూ ఉంటారు. ఈ క్రమంలో గబ్బర్‌సింగ్ సినిమాలో పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ నోట పెలిన ‘నాకొంచెం తిక్కుంది.. దానికో లెక్కుంది’ అనే డైలాగ్‌ను మెడపై చేయి పెట్టే పవన్ మ్యానరిజంతో సహా దించేశాడు.
ఈ వీడియో చూసిన పవన్ అభిమానులు తెగ ఆనందపడిపోతున్నారు. పవన్‌కల్యాణ్ తెలుగులో తప్ప వేరే భాషల్లో సినిమాలు చేయలేదు. అయిన కూడా స్టార్ క్రికెటర్ నోట పవన్ డైలాగ్ రావడంతో ఆ వీడియో వైరల్ అయింది. చిరాగ్ ఆరోరా అనే వ్యక్తి ట్వీట్టర్ ఖాతాలో ఈ వీడియో పోస్ట్ అయింది. పక్కన ఓ యువతి సాయంతో డైలాగ్ చెప్పుతున్న సెహ్వాగ్‌ను మనం చూడొచ్చు. కాగా ఈ వీడియో ఎప్పటిదనే విషయంలో మాత్రం స్పష్టత లేదు.
Sehwag Naidu mass 🔥🔥🔥 pic.twitter.com/y8fj0674sG
— Chirag Arora (@Chiru2020_) September 6, 2021