మహేష్ బాబు, విక్టరీ వెంకటేష్ హీరోగా వచ్చిన సూపర్ హిట్ చిత్రం 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'. ఈ సినిమాలో మహేష్ బాబుతో కలిసి ట్రైన్ సీన్ దగ్గర నటించిన అమ్మాయి గుర్తుందా? ఇప్పుడు ఆ అమ్మాయి హీరోయిగా మారి హాట్ హాట్ గా అందాలను ఆరబోస్తోంది.
సినిమా ఇండస్ట్రీలో రాణించాలి అంటే అందం, అభినయంతో పాటుగా కాస్త అదృష్టం కూడా కలిసి రావాలి. ఇక ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తల్లో చాలా మంది నటీనటులు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా, సైడ్ యాక్టర్స్ గా చిన్న చిన్న రోల్స్ లో కనిపించి మాయం అవుతుంటారు. అయితే ఇలా మయం అయిన వారిలో చాలా తక్కువ మంది మాత్రమే మళ్లీ వెండితెరపై మెరుస్తుంటారు. ప్రస్తుతం ఓ ముద్దుగుమ్మ ఇలాగే మెరిసింది. సైడ్ క్యారెక్టర్ చేసే రేంజ్ నుంచి హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది ఈ భామ. టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన మెరిసి ప్రస్తుతం బాలీవుడ్ లో రాణిస్తోంది. ఆ బ్యూటీ పేరు సుప్రియా ఐసోలా. గతంలో పద్దతిగా మహేష్ పక్కన కనిపించిన ఈ బ్యూటీ ఇప్పుడు ఎంత హాట్ గా ఉందో తెలుసా? ప్రస్తుతం మీరు ఈ ముద్దుగుమ్మ పిక్స్ చూస్తే.. అప్పుడు అంత చక్కగా ఉంది.. ఇప్పడు ఇంత హాట్ గా మారిందేంటి అనుకుంటారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు, విక్టరీ వెంకటేష్ హీరోగా వచ్చిన సూపర్ హిట్ చిత్రం ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా.. చక్కటి ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ గా ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది ఈ సినిమా. ఇక మూవీ మహేష్, వెంకీల కామెడీ టైమింగ్ అదుర్స్ అనే చెప్పాలి. ఇక ఈ సినిమాలో ట్రైన్ సీన్ దగ్గర మహేష్ ఓ అమ్మాయిని చూసి.. ఓ డైలాగ్ చెబుతాడు. అదేంటంటే? చూసిన రెండు నిమిషాలకే పడిపోతుంది ప్రతీదీ అంటూ మహేష్ చెప్పిన ఈ డైలాగ్ ఎంత ఫేమస్ అయ్యిందో మనందరికి తెలిసిందే. ఇక ఈ సీన్ లో నటించిన అమ్మాయి గుర్తుందా? అప్పుడు పంజాబీ డ్రెస్ లో క్యూట్ గా ఉన్న ఈ బ్యూటీ ఇప్పుడు ఎంత హాట్ గా మారిందో చూస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే.
ఆ అమ్మాయి పేరు సుప్రియా ఐసోలా.. తెలుగులో కొన్ని సినిమాల్లో మెరిసిన ఈ భామ. అవసరాల శ్రీనివాస్ నటించిన ‘బాబు బాగా బిజీ’ అనే సినిమాలో బోల్డ్ గా నటించి అందరికి షాక్ ఇచ్చింది. ఆ తర్వాత ఈ అమ్మడుకు అలాంటి పాత్రలే వచ్చాయి. ప్రస్తుతం సుప్రియ బాలీవుడ్ లో బిజీగా మారింది. ఇక తాజాగా వెంకటేష్, రానా నటించిన రానా నాయుడు వెబ్ సిరీస్ లో ఓ కీలక పాత్రలో మెరిసింది. ప్రస్తుతం సుప్రియ అటు బాలీవుడ్ లో ఇటు టాలీవుడ్ లో పలు ప్రాజెక్ట్ లు చేస్తూ.. బిజీగా ఉంది. ఇక ప్రస్తుతం సుప్రియకు సంబంధించిన లేటెస్ట్ హాట్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దాంతో ఈ పిక్స్ చూసిన అభిమానులు.. వామ్మో మహేష్ పక్కన నటించిన ఆ అమ్మాయేనా ఈ అమ్మాయి.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.