ఇండియన్ సినిమాపై సత్యజిత్ రే ముద్ర ఎన్నటికీ చెదరని సంతకమని చెప్పుకోవచ్చు. ఆ మహానుభావుడి కృషికి చిహ్నంగా కేరళకు చెందిన “సత్యజిత్ రే ఫిల్మ్ సొసైటీ”.. వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రముఖులను సత్యజిత్ రే స్మారక పురస్కారంతో సత్కరిస్తోంది. గత మూడేళ్ళుగా ఈ అవార్డు ప్రధానోత్సవం నిరాకటంగా కొనసాగుతూ వస్తుండటం విశేషం. ఇందులో భాగంగానే.. ఈ ఏడాది సత్యజిత్ రే స్మారక పురస్కారానికి టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ బి.గోపాల్ ఎన్నికయ్యారు. ప్రముఖ మలయాళ దర్శకుడు బాలు కిరియత్, సంగీత దర్శకుడు పెరుంబవూర్ జీ రవీంద్రనాథ్ తో పాటు పలువురు సినీ ప్రముఖులతో కూడిన ప్యానల్ బి.గోపాల్ కు ఈ అరుదైన గౌరవాన్ని కట్టబెట్టడం విశేషం.
1986లో విడుదలైన “ప్రతి ధ్వని” సినిమాతో బి.గోపాల్ దర్శకుడిగా తన ప్రస్థానాన్ని మొదలు పెట్టారు. ఇక అక్కడ నుండి ఆయన అందించిన కమర్షియల్ హిట్స్ చాలానే ఉన్నాయి. సాధారణ హీరోలను సైతం మాస్ హీరోలుగా మార్చిన ఘనత బి.గోపాల్ కి మాత్రమే దక్కుతుంది. “అసెంబ్లీ రౌడీ, బొబ్బిలిరాజా , నరసింహనాయుడు, సమర సింహ రెడ్డి, ఇంద్ర” లాంటి ఇండస్ట్రీ హిట్స్ ఈయన ఖాతాలో ఉండటం విశేషం.
ఇంతటి టాలెంట్ ఉన్న బి.గోపాల్ కి ప్రతిష్ఠాత్మకమైన సత్యజిత్ రే స్మారక పురస్కారం దక్కడంతో ఇండస్ట్రీ వర్గాలు సైతం తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయి. మరి.. మీరు కూడా ఈ ఆల్ టైమ్ గ్రేట్ మాస్ డైరెక్టర్ కి కామెంట్స్ రూపంలో విషెస్ తెలియ చేయండి.