Dhanush: హాలీవుడ్లో నటించే అవకాశాలు అందుకున్న అతి కొద్ది మంది భారతీయ నటుల్లో ధనుష్ ఒకరు. ధనుష్ ‘ది ఎక్స్ట్రాడ్నరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్’ సినిమాతో హాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. ఆ వెంటనే ‘ది గ్రే మ్యాన్’ అనే మరో ఇంగ్లీష్ సినిమాలో ప్రముఖ పాత్రలో నటించే అవకాశం దక్కించుకున్నారు. జోయ్ రొస్సో, ఆంథోనీ రోస్సో దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ తారాగణంతో తెరకెక్కింది. ఇందులో క్యాప్టన్ అమెరికా ఫేమ్ క్రిస్ ఇవాన్స్ హీరోగా నటించారు.
ఈ సినిమా జులై 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా ప్రమోషన్లలో భాగంగా చిత్ర దర్శకులు రుస్సో బ్రదర్స్ ఇండియాకు వచ్చారు. ఓ రెండు రోజుల పాటు ముంబైలో ఉన్నారు. రుస్సో బ్రదర్స్ నిర్వహించిన ప్రమోషన్లలో హీరో ధనుష్‌తో పాటు పలువురు బాలీవుడ్ సెలెబ్రిటీలు పాల్గొన్నారు. ధనుష్- సారా అలీఖాన్ ఓ ప్రమోషన్ కార్యక్రమానికి కలిసి రావటం చర్చనీయాంశంగా మారింది.
ధనుష్-సారా అత్యంత సన్నిహితంగా ఉన్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో.. ఇద్దరూ నవ్వుతూ, చేతిలో చెయ్యి వేసుకుని నడుస్తూ.. ఫొటోలకు ఫోజులు ఇస్తూ ఉన్నారు. దీంతో నెటిజన్లు సారాపై ఆగ్రహం వ్కక్తం చేస్తున్నారు. ఆమె కారణంగానే ధనుష్ తన భార్య ఐశ్వర్య రజనీకాంత్‌కు విడాకులు ఇచ్చారని ఆరోపిస్తున్నారు.
18 ఏళ్ల వివాహ బంధాన్ని కాదని ధనుష్ తన భార్యను విడిచిపెట్టాడని మండిపడుతున్నారు. దానంతటికి కారణం సారానేనని అంటున్నారు. తాజాగా కాఫీ విత్ కరణ్‌లో ఆమె చేసిన ఓ కామెంట్‌ను గుర్తు తెస్తున్నారు. ‘ డేటింగ్‌కు పెళ్లయిన వాడైనా ఓకే’ అని సారా అనటం ధనుష్ కోసమేనని పేర్కొంటున్నారు. మరి, సారాపై నెటిజన్లు మండిపడటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Nani: నాని కామెంట్స్ వైరల్.. అప్పుడు చిరంజీవి.. ఇప్పుడు రవితేజ..!