హీరో నాని.. ఈ మధ్య కాలంలో తరచుగా వివాదాల్లో చిక్కుకుంటున్న సంగతి తెలిసిందే. సినిమా టికెట్ల రేట్ల వివాదంపై నాని చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించాయి. వైసీపీ నేతలంతా ఆయనను ఓ రేంజ్లో ఆడేసుకున్నారు. కొన్ని రోజుల పాటు ఆ వివాదం కొనసాగింది. ఈ క్రమంలో తాజాగా నాని మారోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం అవి నెట్టింట వైరల్‌గా మారాయి. మాస్ మహారాజ్ రవితేజ హీరోగా రాబోతున్న కొత్త సినిమా రామారావు ఆన్ డ్యూటీ. శరత్ మాండవ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రంలో రవితేజ ఎం.ఆర్.ఓ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. చిత్రంలో రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్ హీరోయిన్లుగా నటించారు. ఓ సిన్సియర్ గవర్నమెంట్ ఆఫీసర్ అవినీతి రాజకీయ నాయకుల భరతం ఎలా పట్టాడనేదే సినిమా. ఈ చిత్రాన్ని జులై 29 న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఆదివారం ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకు అతిధిగా వచ్చిన నాని.. రవితేజపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. నేను వచ్చింది గెస్టుగా కాదు.. రవి అన్న గురించి మాట్లాడేది ఉందని మాత్రమే ఇక్కడికి వచ్చానంటూ రవితేజ గురించి చెప్పుకొచ్చాడు నాని. ‘‘రవి అన్న తన కెరీర్ స్టార్ట్ చేసే సమయంలో చిరంజీవి గారిని ఎలా అయితే స్ఫూర్తిగా తీసుకున్నారో.. మా జనరేషన్లో నా కెరీర్ స్టార్ట్ చేసే సమయంలో నేను రవి అన్నను అలా ఇన్స్పైరింగ్గా తీసుకున్నాను. చిరంజీవి గారి కేరవ్యాన్‌లోకి మీరు వెళ్లారు కదా.. త్వరలోనే నేను కూడా మీ కేరవ్యాన్‌లోకి రావాలనుకుంటున్నాను. ప్రతీ సినిమాను చూసి ఫోన్ చేస్తారు.. మంచి సినిమా తీస్తే అందరినీ ప్రోత్సహించాలని అనుకుంటారు. రామారావు ఆన్ డ్యూటీ మీద ముందు నుంచి పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. విడుదల చేసిన అన్ని అప్ డేట్స్ సినిమాపై ఆసక్తి పెంచాయి’’ అన్నాడు. టీజర్, ట్రైలర్ చూశాక నా నమ్మకం ఇంకా పెరిగింది అన్నాడు నాని. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, రవితేజ టీం వర్క్స్ బ్యానర్స్‌పై సుధాకర్ చెరుకూరినిర్మాతగా భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందించారు. 1995 నాటి నేపథ్యంలో యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాతో రవితేజ మరోసారి బాక్సాఫీస్ దాడి చేయబోతున్నట్లు చెప్పుకుంటున్నారు. ఈ మూవీపై మాస్ మహారాజ్ ఫ్యాన్స్ బోలెడన్ని అంచనాలు పెట్టుకున్నారు. నాని చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: Nani: మంచి సినిమా చేయమని కంప్లైంట్ చేయడం కాదు.. అవి వచ్చినప్పుడు చూడాలి కదా?: నాని ఇది కూడా చదవండి: సూర్య, నాని, దుల్కర్ సల్మాన్ లతో భారీ మల్టీస్టారర్.. స్టార్ డైరెక్టర్ మాసివ్ ప్లాన్!