స్టార్ హీరోయిన్ సమంత, చాలా రోజుల తర్వాత బయట కనిపించింది. మయాసైటిస్ బారిన పడినట్లు సమంత గతేడాది ప్రకటించింది. ఆ తర్వాత సమంత లీడ్ రోల్ చేసిన ‘యశోద’ థియేటర్లలో విడుదలైంది. మిక్స్ డ్ టాక్ తెచ్చుకుని ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత నుంచి సోషల్ మీడియాలో గానీ, బయటగానీ సమంత జాడ ఎక్కడా కనిపించలేదు. దీంతో సామ్ గురించి రకరకాల ఊహాగానాలు వచ్చాయి. ఇప్పుడు వాటన్నింటికి చెక్ పెడుతూ ముంబయి ఎయిర్ పోర్ట్ లో ఈమె కనిపించింది. కాకపోతే ఈమెని చూసి చాలామంది షాకవుతున్నారు.
ఇక విషయానికొస్తే.. సమంత పేరు చెప్పగానే అందరికీ ఆమె నటించిన అద్భుతమైన సినిమాలు, నాగచైతన్యతో పెళ్లి-విడాకులు ఇవే గుర్తొస్తాయి. ఇక హీరోయిన్ అంటే గ్లామర్ మాత్రమే అనేలా కాకుండా యాక్టింగ్ ఓరియెంటెడ్ రోల్స్ కూడా చేసి గుర్తింపు తెచ్చుకుంది. ‘ద ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ సెకండ్ సీజన్ లోనూ రాజీ అనే ప్రతినాయక లక్షణాలున్న పాత్రలో నటించింది. ఫైట్స్ కూడా ఫ్యాన్స్ ని ఫుల్ ఎంటర్ టైన్ చేసింది. ఆ తర్వాత నుంచి చాలా సెలెక్టివ్ గా మూవీస్ చేస్తున్న సామ్.. ‘యశోద’ మూవీ కోసం ఒకేఒక్క ఇంటర్వ్యూ ఇచ్చింది. రీసెంట్ గా ‘శాకుంతలం’ సినిమా కోసం డబ్బింగ్ చెబుతున్నట్లు ఇన్ స్టాలో ఓ పోస్ట్ పెట్టింది.
ఇదంతా పక్కనబెడితే తాజాగా శుక్రవారం ఉదయం ముంబయి ఎయిరో పోర్ట్ లో వైట్ డ్రస్ లో కనిపించింది. సీరియస్ గా నడుచుకుంటూ వెళ్లిపోయింది. అయితే సమంతని ఇలా చూసి ఫ్యాన్స్ తీసుకోలేకపోతున్నారు. ఇదిలా ఉండగా.. సమంత మయాసైటిస్ వ్యాధి థర్డ్ స్టేజీలో ఉందని, అందుకే సమంత బయట ఎక్కువగా కనిపించట్లేదని తెలుస్తోంది. అలానే సమంతని తాజా వీడియోలో చూస్తే.. ఇప్పుడిప్పుడు సెట్ లోనూ అడుగుపెట్టేలా కనిపించట్లేదు. ‘ఖుషి’ సినిమాలో సమంత సీన్స్ ఇంకా పూర్తి కావాల్సి ఉంది. అలానే కొత్త ప్రాజెక్టులు కూడా సామ్ ఒప్పుకోవడం లేదు. అలానే సమంత, ముంబయి ఎందుకు వెళ్లిందనేది తెలియాల్సి ఉంది. సరే ఇదంతా పక్కనబెడితే సమంత వీడియో చూడగానే మీకు ఏమనిపించింది. కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని పోస్ట్ చేయండి.
#SamanthaRuthPrabhu At Mumbai Airport ! @Samanthaprabhu2 ! pic.twitter.com/RGTi2WuzP1
— TamilaninCinema (@TamilaninCinema) January 6, 2023