చైతూ, శోభిత డేటింగ్‌లో ఉన్నారంటూ గత కొన్ని నెలలుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలిసి ఉన్న ఫొటోలు సైతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ నేపథ్యంలోనే..
సౌత్ ఇండియాన్ స్టార్ హీరోయిన్ సమంత నటించిన ‘ శాకుంతలం’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ పౌరాణిక సినిమా ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా బృందం ప్రమోషన్లలో బిజీ అయిపోయింది. చిత్ర హీరోయిన్ సమంత కూడా సినిమా ప్రమోషన్లలో పాల్గొంటున్నారు. తెలుగుతో పాటు నేషనల్ మీడియాకు కూడా వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె చైతూ, శోభితల రిలేషన్‌షిప్ రూమర్స్‌పై కామెంట్లు చేసినట్లు వార్తలు వచ్చాయి. ‘‘ఎవరు ఎవరితో రిలేషన్‌లో ఉంటే నాకేం.. నేను దాని గురించి బాధపడటం లేదు.
ఎవరైతే ప్రేమకు విలువ ఇవ్వరో వారు కన్నీళ్లలో మునిగిపోతారు. అది ఎంతమందితో డేటింగ్ చేసినా సరే. చివరకు ఆడవాళ్లు సంతోషంగా ఉంటారు’’ అని సమంత అన్నదన్నట్లు ప్రచారం జరిగింది. అయితే, ఈ వ్యాఖ్యలపై సమంత క్లారిటీ ఇచ్చింది. తాను అలా అనలేదని చెప్పింది. ఈ మేరకు తన ట్విటర్ ఖాతాలో ఓ పోస్టు పెట్టింది. ‘‘ నేను అలా అనలేదు’’ అని పేర్కొంది. దీంతో ఈ తప్పుడు ప్రచారానికి తెరపడింది. కాగా, సమంత గత కొన్ని నెలలుగా మైయోసైటిస్ అనే అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. అనారోగ్యం కారణంగా ఆమె కొన్ని నెలలు సినిమా షూటింగ్‌లకు కూడా దూరం అయ్యారు.
కేవలం ఇంటికే పరిమితమై చికిత్స తీసుకున్నారు. ఆరోగ్యం కొంత కుదుట పడ్డాక షూటింగుల్లో పాల్గొనటం మొదలుపెట్టారు. శాకుంతలంతో పాటు విజయ్ దేవరకొండతో నటిస్తున్న ‘ఖుషి’ సినిమా షూటింగ్‌లో కూడా పాల్గొన్నారు. ఇక, శాకుంతలం సినిమాకు స్టార్ డైరెక్టర్ గుణశేఖర్ దర్వకత్వం వహించారు. 80 కోట్ల రూపాయలతో ఈ సినిమా తెరకెక్కింది. మోహన్ బాబు, దేవ్ మోహన్, అదితి బాలన్ ప్రధాన పాత్రల్లో నటించారు.