గత కొన్ని నెలలుగా సమంత మైయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. అనారోగ్యం కారణంగా సినిమా షూటింగ్‌లకు సైతం బ్రేక్ ఇచ్చారు. ఆరోగ్యం కొంత బాగైన నేపథ్యంలో మళ్లీ షూటింగ్‌లలో పాల్గొంటున్నారు. కఠినమైన ట్రైనింగ్‌లు తీసుకుంటున్నారు.
ఒకప్పుడు సినిమాల కోసం హీరోలు ఎక్కువ శ్రమ పడేవారు. ముఖ్యంగా బాడీని సరైన షేపులో ఉంచుకోవటానికి జిమ్‌లో గంటల తరబడి వర్కవుట్లు చేసేవారు. ఫైట్ సీన్ల కోసం ప్రత్యేకమైన ట్రైనింగ్‌లు తీసుకునేవారు. హీరోయిన్ అంటే కేవలం అందం అన్న క్యాటగిరీకి మాత్రమే పరిమితం అయి ఉండేది. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. హీరోలతో సమానంగా హీరోయిన్లు కూడా సినిమా కోసం కష్టపడుతున్నారు. ముఖ్యంగా యాక్షన్ సీన్లకోసం ప్రత్యేకమైన ట్రైనింగ్ తీసుకుంటున్నారు. డీగ్లామర్ రోల్స్‌ను కూడా ఎలాంటి అభ్యంతరం లేకుండా చేస్తున్నారు. సినిమా కోసం ఎంతటి కష్టాన్నైనా భరించటానికి సిద్ధమయ్యే అతి కొద్ది మంది హీరోయిన్లలో సమంత ఒకరు. సినిమా కోసం ఎంతటి కష్టాన్నైనా ఇష్టంగా భరించేస్తారు.
ఇందుకు చెప్పుకోవటానికి చాలా ఉదాహరణలే ఉన్నాయి. ప్రస్తుతం ఆమె మైయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నారు. ఈ వ్యాధి కారణంగా ఆమె ఆరోగ్యం చాలా దెబ్బతింది. కొన్ని రోజుల క్రితం వరకు షూటింగ్‌లు మొత్తం క్యాన్సిల్ చేసుకున్నారు. ఆరోగ్యం కొద్దిగా బాగుపడ్డ తర్వాత మళ్లీ షూటింగుల్లో పాల్గొంటున్నారు. దర్శకులు రాజ్, డీకేల దర్శకత్వంలో సిడాటెల్ అనే వెబ్ సిరీస్లో నటిస్తున్నారు. ఈ హిందీ వెబ్ సిరీస్ యాక్షన్ ప్రధానంగా సాగుతుంది. అందుకే సమంత యాక్షన్ సీక్వెన్స్‌ల కోసం గట్టిగా ప్రిపేర్ అవుతున్నారు. హలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ యూనిక్ బెన్ యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఇందుకోసం ఆయన సమంతకు ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తున్నారు.
సమంత యూనిక్ బెన్ వద్ద ట్రైనింగ్ తీసుకుంటున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మైనస్ 8 డిగ్రీల చలిలో ఆమె ట్రైనింగ్ తీసుకుంటున్నారు. తనకు ఎంతో ఇష్టమైన యూనిక్ బెన్‌తో పని చేయటాన్ని ఆమె ఆస్వాధిస్తున్నారు. ఇక, సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. మైయోసైటిస్‌తో బాధపడుతున్నా.. పని విషయంలో వెనక్కు తగ్గటం లేదంటూ పొగుడ్తున్నారు. మరి, మైనస్ 8 డిగ్రీల చలిలో సమంత ట్రైనింగ్ తీసుకోవటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.