వివాదాస్పద యోగా గురువు బాబా రామ్‌దేవ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సినీ తారలపై, బాలీవుడ్ ఇండస్ట్రీపై వివాదాస్పద ఆరోపణలు చేశారు. బాలీవుడ్‌లో డ్రగ్స్ వాడకం విరివిగా జరగుతుందంటూ సంచలన ఆరోపణలు చేశాడు. ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో శనివారం ఏర్పాటు చేసిన ఆర్యవీర్, వీరాంగన సదస్సులో బాబా రామ్‌దేవ్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా రామ్‌దేవ్ మాట్లాడుతూ.. బాలీవుడ్‌లో చాలా మంది డగ్ర్ వాడుతున్నారని అన్నారు. షారుఖ్ ఖాన్ కుమారుడు ఈ మధ్య డ్రగ్స్ కేసులో జైలుకు కూడా వెళ్లివచ్చాడని, ఇక సల్మాన్ ఖాన్ డగ్ర వాడుతున్నాడని, ఆమీర్ ఖాన్ వాడుతున్నాడో లేదో తెలియదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఇక బాలీవుడ్ హీరోయిన్ల గురించి కూడా ప్రస్తావించిన రామ్‌దేవ్.. వాళ్ల గురించి ఆ దేవుడికే మాత్రమే తెలుసన్నారు. బాలీవుడ్ మొత్తం డ్రగ్స్ గుప్పిట్లో ఉందని అన్నారు. ఇప్పటికే సినిమా రంగాన్ని తన గుప్పిట్లోకి తీసుకున్న డ్రగ్స్.. రాజకీయాల్లోకి కూడా అడుగుపెట్టినట్లు పేర్కొన్నారు. దేశంలో ఎన్నికలు జరిగే సమయంలో మద్యం ఏరులై పారుతోందని అన్నారు. డ్రగ్ బానిసత్వం నుంచి భారతదేశాన్ని విముక్తి చేసేందుకు అందరూ కృషి చేయాలిన రామ్‌దేవ్ పిలుపునిచ్చారు. అలాగే డ్రగ్స్ విముక్త్ భారత్ కోసం ఉద్యమం చేయనున్నట్లు బాబా రామ్‌దేవ్ వెల్లడించారు.
బాబా రామ్‌దేవ్ చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇలా అనేక సందర్భంల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసే రామ్‌దేవ్ బాబా.. కరోనా సమయంలో పతాంజలి నుంచి ఒక మందుని కనిపెట్టి, 100 మంది కరోనా పేషెంట్లపై ట్రైల్స్ కూడా చేసినట్లు వెల్లడించారు. ఈ మెడిసిన్ విషయంలో ఆయన కేంద్ర ప్రభుత్వం సీరియస్ కూడా అయింది. సరైన నిర్ధారణ పరీక్షలకు లేకుండా కరోనా మందుల పేరుతో ప్రజల నుంచి డబ్బు దోచుకోవద్దంటూ నెటిజన్లు సైతం రామ్‌దేవ్ బాబాపై విమర్శలు గుప్పించారు.
‘Salman Khan भी लेता है Drugs, Actresses का तो भगवान ही मालिक है’
बाबा रामदेव का Bollywood Industry पर आरोप
मुरादाबाद में दिया भाषण pic.twitter.com/GH1PgKi9zi
— News24 (@news24tvchannel) October 15, 2022