Salman Khan: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘పుష్ప’ మూవీ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన పుష్ప.. బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో క్రేజ్ సొంతం చేసుకుంది. బాలీవుడ్ లో 100కోట్లు వసూల్ చేసి రికార్డు సృష్టించింది. అయితే.. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ ఆటిట్యూడ్ కి, పుష్ప పాటలకు క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని చెప్పాలి. ఈ సినిమాలో అన్ని పాటలు సూపర్ హిట్ అయ్యాయి.
ఒక్కో పాటగా చూస్తే ఐటమ్ సాంగ్ ‘ఊ అంటావా మావ’ ఎక్కువగా క్లిక్ అయ్యింది. అల్లు అర్జున్ సరసన స్టార్ హీరోయిన్ సమంత ఆడిపాడిన ఈ పాట.. మాస్ ఆడియెన్స్ అందరికీ ట్రీట్ ఇచ్చిందనే చెప్పాలి. పుష్ప విడుదలైన అన్ని భాషల్లోనూ ‘ఊ అంటావా’ పాట బిగ్గెస్ట్ హిట్ అయ్యింది. సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేసింది. అయితే.. ఇప్పటికీ అడపాదడపా ఊ అంటావా పాట ఎక్కడో చోట వినిపిస్తూనే ఉంటుంది. ముఖ్యంగా సెలబ్రిటీల నోటి నుండి వస్తే మాత్రం ట్రెండ్ అవుతుంది.
తాజాగా బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ నోట ఊ అంటావా పాట వినిపించింది. ఇటీవల జరిగిన ఓ ఈవెంట్ లో పాల్గొన్న సల్మాన్.. ‘ఈ మద్యకాలంలో మిమ్మల్ని బాగా ఇన్‌స్పైర్ చేసిన సినిమా గానీ, పాట గానీ ఏదైనా ఉందా?’ అని ప్రశ్నించగా.. ‘ఊ అంటావా మావా’ అని హమ్ చేస్తూ వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అయితే.. ఈ వీడియోని సమంత ‘రెడ్ లిటిల్ హార్ట్స్’తో రీట్వీట్ చేసింది. ఇక ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇదివరకే రన్వీర్ సింగ్ ఈ పాటను తన ఫేవరేట్ అని చెప్పాడు. ఇప్పుడు సల్మాన్ కూడా చెప్పేసరికి.. అటు పుష్ప ఫ్యాన్స్ తో పాటు సమంత ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. మరి ఈ వీడియో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
♥️♥️♥️ https://t.co/UzkF0PVspl
— Samantha (@Samanthaprabhu2) June 26, 2022