సల్మాన్ ఖాన్ బాడీగార్డ్స్ ఆ స్టార్ హీరోతో దారుణంగా ప్రవర్తించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిన్లు..
భారత చిత్ర పరిశ్రమలో తరచుగా వివాదాల్లో నిలిచే స్టార్ హీరోల్లో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఒకరు. ఆయనకు సంబంధం ఉన్నా లేకున్నా కొన్ని సార్లు వివాదాల్లో నిలుస్తూ ఉంటారు. సల్మాన్ ప్రస్తుతం ఐఫా సినిమా ఉత్సవాల కోసం అబుదాబీలో ఉన్నారు. అక్కడ చోటు చేసుకున్న ఓ సంఘటన ప్రస్తుతం బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. సల్మాన్‌ను మరోసారి వివాదాల్లోకి లాగింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. అబుదాబిలో జరుగుతున్న సినిమా వేడుకలో సల్మాన్‌తో పాటు చాలా మంది బాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్నారు.
వారిలో విక్కీ కౌశల్ కూడా ఉన్నారు. వేడుకల సందర్భంగా సల్మాన్ తన సెక్యూరిటీ మధ్యలో నడుచుకుంటూ వెళుతున్నారు. ఓ చోట విక్కీ కౌశల్ సల్మాన్‌ను కలిసేందుకు ప్రయత్నించారు. అయితే, సల్మాన్ సెక్యూరిటీ విక్కీ కౌశల్‌ను పక్కకు తోసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతమై కామెంట్లు వస్తున్నాయి. నెటిజన్లు స్పందిస్తూ.. ‘‘ సల్మాన్ ఫ్యాన్స్‌కు ఇంత కండకావరం ఎందుకు?’’..
‘‘ఓ స్టార్ హీరోను ఇంత ఘోరంగా అవమానిస్తారా?’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే, ఈ వీడియోపై విక్కీ కౌశల్ భార్య కత్రినా కైఫ్ ఎలా స్పందిస్తుందన్నదే ప్రశ్నార్థకంగా మారింది. ఆమె ఈ సంఘటనను సాధారణంగా తీసుకుంటుందా? లేక సల్మాన్ ఖాన్ బాడీగార్డ్స్‌పై ఫైర్ అవుతుందా అన్నది వేచి చూడాలి. మరి, బాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన విక్కీ కౌశల్‌ను సల్మాన్ ఖాన్ బాడీగార్డ్స్ దారుణంగా అవమానించటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Zara bach ke Vicky 😬
by u/yours_truly_Davina in BollyBlindsNGossip