సినీ ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు రిలీజ్ అయితే గానీ వాటి ప్రభావం ప్రేక్షకులలో కనిపించదు. కొన్ని సినిమాలు మాత్రం అనౌన్స్ మెంట్ నుండే అంచనాలు పెంచేస్తుంటాయి. అలా కాంబినేషన్ సెట్ అవ్వగానే అంచనాలు పీక్స్ కి చేరుకున్న సినిమా సలార్. డార్లింగ్ ప్రభాస్ – డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే 30% షూటింగ్ పూర్తి చేసుకుంది. కేజీఎఫ్ ఫేమ్ విజయ్ కిరగందుర్ ఈ సినిమాను భారీ బడ్జెట్ లో నిర్మిస్తున్నారు.
ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పాన్ ఇండియా స్థాయి డైరెక్టర్ ప్రశాంత్ సినిమా అంటే.. ఫ్యాన్స్ లో హైప్ ఏ స్థాయిలో ఉండాలో అంతకుమించి సలార్ సెట్ చేసింది. 2023 సమ్మర్ లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు సంబంధించి ఎప్పుడెప్పుడు అప్ డేట్స్ అందిస్తారా అని దేశవ్యాప్తంగా డార్లింగ్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా సలార్ సినిమాపై మరింత హైప్ పెంచుతూ నిర్మాత విజయ్ ఓ సెన్సేషనల్ స్టేట్ మెంట్ చేశారు. ప్రస్తుతం విజయ్ స్టేట్ మెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Vijay Kiragandur of Hombale Films “We have set the bar very high for #Salaar. On one hand, we have #Prabhas, who is the hero of India’s number one movie (BB2) and on the other hand, we have #PrashanthNeel and Hombale, who made the second biggest film of India (KGF 2).. (1/2) pic.twitter.com/UAeAByiavJ
— Thyview (@Thyview) May 24, 2022
ఆయన మాట్లాడుతూ.. “మేము సలార్ కోసం టార్గెట్స్ అన్ని భారీ స్థాయిలో సెట్ చేశాం. ఓవైపు పాన్ ఇండియా నెంబర్ 1 హీరో ప్రభాస్, మరోవైపు రెండో పాన్ ఇండియా బిగ్ మూవీ కేజీఎఫ్ తీసిన దర్శకుడు ప్రశాంత్ నీల్ మరియు హోంబలే ఫిలిమ్స్ ఉన్నాయి. ఇది డెడ్లీ కాంబినేషన్ అని తెలుసు. ఈ కాంబినేషన్ సెట్ అయినప్పుడే సినిమా సంచనలంగా మారింది. ఇప్పుడదే మాకు పెద్ద సవాల్ అయ్యింది. మేము సలార్ తో క్రియేట్ చేసిన హైప్, అంచనాలను రీచ్ అయ్యేందుకు మా వంతు ప్రయత్నం చేస్తున్నాం. కానీ సలార్ తో కుంభస్థలాన్ని బద్దలు కొట్టబోతున్నాం” అని చెప్పుకొచ్చారు. ఇప్పుడు విజయ్ మాటలతో ఫ్యాన్స్ మామూలు హ్యాపీలో లేరు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతిహాసన్ హీరోయిన్ కాగా, విలన్ గా పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. మరి సలార్ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.