పెళ్లిళ్ల సీజన్ కావడంతో అందరితో పాటుగా సెలబ్రిటీలు కూడా ఓ ఇంటివాళ్లు అయిపోతున్నారు. అలా తాజాగా సరిగమప ద సింగింగ్ ఐకాన్ షోతో పాపులర్ అయిన సింగర్ లక్ష్మీ ప్రతిమ కూడా పెళ్లి పీటలు ఎక్కేసింది. 2020లో సిరిగమప సింగింగ్ షోతో ఈ వైజాగ్ సింగర్ బాగా పాపులర్ అయ్యింది. ఆ షో తర్వాత ఎన్నో గొప్ప అవకాశాలను సొంతం చేసుకుంది. ప్రైవేట్ సాంగ్స్, కవర్ సాంగ్స్ కూడా పాడేసింది. ఆ షో తర్వాత ఈమెకు ఫాలోయింగ్ కూడా బాగానే పెరిగింది. ఇప్పుడు ప్రతిమ వివాహం చేసుకుంది సాధారణ వ్యక్తినేం కాదు. ఆమె వివాహం చేసుకున్న వ్యక్తి మీమర్, డాన్సర్, కంటెంట్ క్రియేటర్ కూడా. ఒకరకంగా చూసుకుంటే లక్ష్మీ ప్రతిమ కంటే అతనికే ఎక్కువ ఫాలోయింగ్ ఉందని చెప్పాలి. గతవారం వీళ్ల వివాహం ఘనంగా జరిగింది. ప్రస్తుతం వీళ్ల పెళ్లి ఫొటోలు వైరల్ గా మారాయి.
సింగర్ లక్ష్మీ ప్రతిమ వివాహం చేసుకుంది మీమర్ హర్షాసాయిని. ఇతను కూడా వైజాగ్ వాసే. హర్షా సాయి ఎంత పాపులర్ అంటే జాతీయ మీడియా కూడా ఇతడిని పొగుడుతూ ఆర్టికల్ పబ్లిష్ చేసింది. ఇప్పుడు ఈ ఇద్దరు సెలబ్రిటీలు పెళ్లి బంధంతో ఒకటవ్వడంతో ఇద్దరి అభిమానులు ఆనందం వ్యక్తం చేేస్తున్నారు. సింగర్ గా లక్ష్మీ ప్రతిమకు అభిమానులు ఉంటే.. మీమర్ గా హర్షాసాయికి సెలబ్రిటీలు కూడా అభిమానులుగా ఉన్నారు. ఇప్పుడు హర్షాసాయి నుంచి కపుల్ రీల్స్, మీమ్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఆర్జే కాజల్ కూడా హర్షా నుంచి కపుల్ మీమ్స్ కావాలంటూ డిమాండ్ చేసింది. ఇప్పుడు నెట్టింట వీళ్ల పెళ్లి వార్త బాాగా వైరల్ అవుతోంది. వీళ్ల ఇన్ స్టాగ్రామ్ పోస్టులు కూడా వైరల్ అవుతున్నాయి.