ఇటీవల సినీ ఇండస్ట్రీలో ఎన్నో విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. సినీ నటులు, దర్శక, నిర్మాతలు ఇంతర సాంకేతిక రంగాలకు చెందిన ప్రముఖులు కన్నుమూస్తున్నారు. కారణాలు ఏవైనా తాము ఎంతగానే అభిమానించేవారు ఇక లేరు అన్న విషయం తెలుసుకొని అభిమానులు శోకసంద్రంలో మునిగిపోతున్నారు.
ఇటీవల సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రముఖ నటీనటులు, దర్శక, నిర్మాతలు.. ఇతర సాంకేతిక వర్గానికి చెందిన వారు కన్నుమూయడంతో వారి కుటుంబ సభ్యులే కాదు.. అభిమానులు సైతం శోక సంద్రంలో మునిగిపోతున్నారు. గత ఏడాది టాలీవుడ్, బాలీవుడ్ లో దిగ్గజ నటులు, దర్శకులు కన్నుమూశారు. తాజాగా ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది.. తన గానంతో కుర్రకారును ఉర్రూతలూగించిన ప్రముఖ పాప్ సింగర్ కన్నుమూశాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..
రష్యన్ పాప్ సింగర్ దిమా నోవా.. వయసు 35 ఏళ్లు చిన్న వయసులోనే కన్నుమూశాడు. దిమా నోవా అసలు పేరు దిమిత్రి విర్గినోవ్. చిన్ననాటి నుంచే తన గానంతో ఎంతోమందిని అలరించిన దిమా నోవా ‘క్రీమ్ సోడా’ అనే మ్యూజిక్ సంస్థను నడుపుతున్నాడు. ఈ నెల 19న తన సోదరుడు తో పాటు మరో ముగ్గురు స్నేహితులతో కలిసి గడ్డ కట్టిన వోల్గా నదిని దాటుతున్న సమయంలో పెద్ద ప్రమాదం సంభవించి మంచులో పడిపోయి కూరుకుపోయారు. ఆ సమయంలోనే దిమా నోవా ఊపిరి ఆడక చనిపోయాడు. మంచు కింద చిక్కుకున్న దిమా నోవా ఇద్దరు స్నేహితులను రక్షించగా.. మరో స్నేహితుడిని ఆస్పత్రికి తరలించే లోపు కన్నుమూశాడని క్రీమ్ సోడా వెల్లడించింది.
రష్యాలో క్రీమ్ సోడా అనే మ్యూజికల్ ఎలక్ట్రానిక్ గ్రూప్‌ను స్థాపించిన దిమా నోవా తన గానంతో కోట్ల మంది అభిమానులను సంపాదించాడు. పాపులర్ సింగర్ గా పేరు తెచ్చుకున్న దిమా నోవా ఇటీవల ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న యుద్ధాన్ని నిరసిస్తూ తన సంగీతం, పాటలతో పుతిన్‌ను విమర్శించేవాడు. ఈ క్రమంలోనే అక్వా డిస్కో అనే పాటకు విపరీతమైన క్రేజ్ వచ్చింది.. అది పెద్ద వివాదం కూడా అయ్యింది. రష్యాకు వ్యతిరేకంగా ఆందోళనలు చేసేవారు ఈ పాట పాడుతూ నిరసనలు తెలిపేవారు. అంతేకాదు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పై కూడా వ్యక్తిగతంగా తీవ్ర విమర్శలు చేసేవాడు దిమా నోవా. ఇక దీమా నోవా ప్రమాదంలో మరణించినట్లు క్రీమ్ సోడా ధృవీకరించింది. దీంతో అభిమానులు ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయారు.
Russian pop star who criticized Vladimir Putin found dead. He was 34. https://t.co/QtCSNLel7H
— Cawnporiaah (@Cawnporiaah) March 22, 2023