ఈ మధ్యకాలంలో విడాకులు అనే మాట సర్వసాధారణం అయిపోయింది. సామాన్యుల నుండి సెలబ్రిటీలు(సినిమా, స్పోర్ట్స్, రాజకీయం, బిజినెస్ రంగాలవారి) వరకు అందరూ విడాకులు తీసుకోవడం అనేది రోజువారీ వార్తల్లో భాగమైపోయింది. కానీ వేరే రంగాలవారి పరిస్థితి ఎలా ఉన్నా.. సినీ రంగానికి చెందిన సెలబ్రిటీలు విడాకులు తీసుకోవడం అనేది మాత్రం అటు ఇండస్ట్రీలో, ఇటు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది.
ఇదివరకు నార్త్ లో ఎక్కువగా విడాకుల గోల వినిపించేది. కానీ ఇప్పుడు సౌత్ లో.. అదికూడా టాలీవుడ్ లో విడాకుల గోల ఎక్కువగా వినిపిస్తుంది. ఇటీవలే నాగచైతన్య – సమంత విడిపోయి ఫ్యాన్స్ కి హార్ట్ బ్రేక్ చేశారు. ఇప్పుడు అదే బాటలో మరో టాలీవుడ్ జంట విడాకులు తీసుకునేందుకు రెడీ అయిందనే వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. సీనియర్ నటుడు జేడీ చక్రవర్తి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు.వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ పరిచయం చేసిన జేడీ.. ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు తెచుకున్నాడు. అయితే.. 45 ఏళ్ల వయసు పైబడినా పెళ్లి చేసుకోని జేడీ.. ఐదేళ్ల కిందట RGV సమర్పణలో సావిత్రి అనే సినిమా డైరెక్ట్ చేసేందుకు ప్లాన్ చేశాడు. ఆ సినిమాలో హీరోయిన్ అనుకృతి గోవింద్ శర్మ. ఇక వర్మ సినిమా అంటే తెలిసిందేగా.. హీరోయిన్ తో ఓ రేంజిలో ఫోటోషూట్స్ చేసి పోస్టర్స్ రిలీజ్ చేశారు. మరి పలు కారణాలతో ఆ సినిమా అయితే అగిగిపోయింది కానీ జేడీ చక్రవర్తి మాత్రం హీరోయిన్ అనుకృతితో లవ్ లో పడిపోయాడు.
కట్ చేస్తే.. అతి కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో జేడీ – అనుకృతిల పెళ్లి అయిపోయింది. ఓకే లేటు వయసులో అయినా జేడీ ఓ ఇంటివాడు అయ్యాడని అంతా సంతోషించారు. ఐదేళ్లుగా వారి వివాహ బంధం గురించి ఎక్కడా ఏ వార్తా బయటికి రాలేదు. మరి సడన్ గా ఏమైందో తెలియదు గానీ, అనుకృతితో జేడీ విడాకులకు సిద్ధమయ్యాడని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో ఎంతవరకు నిజముందో తెలీదు కానీ జేడీ విడాకుల పై క్లారిటీ రావాల్సి ఉంది. ఏదేమైనా ఇది పుకారుగానే ముగిస్తే బాగుంటుందని భావిద్దాం. ఇక జేడీ చక్రవర్తి – అనుకృతి జంట పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.