దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘RRR’. బాహుబలి తర్వాత రాజమౌళి నుండి వచ్చిన సినిమా ఇదే. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా.. పాన్ ఇండియా పీరియాడిక్ మల్టీస్టారర్ గా RRR రూపొందింది. ఇటీవల మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా.. అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టి మరోసారి బాక్సాఫీస్ వద్ద తెలుగు సినిమా సత్తా చాటింది.
దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ అద్భుత దృశ్యకావ్యానికి సినీ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇద్దరు బిగ్ స్టార్స్.. అందులోను రాజమౌళి క్రేజ్ తో భారీస్థాయిలో విడుదలైన ఈ సినిమా.. అటు ఫ్యాన్స్, ఇటు ప్రేక్షకుల అంచనాలను అలవోకగా బీట్ చేసి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇటీవలే బాక్సాఫీస్ వద్ద 25 రోజులు పూర్తిచేసుకున్న RRR.. వరల్డ్ వైడ్ 1100 కోట్లు కొల్లగొట్టి రికార్డు సృష్టించింది.
ఇప్పటికీ దేశవ్యాప్తంగా ట్రిపుల్ ఆర్ విజయవంతంగా అన్ని థియేటర్లలో రన్ అవుతోంది. ఇక ఎలాగో థియేట్రికల్ రిలీజ్ అయిపోయింది కాబట్టి.. RRR ఓటిటి రిలీజ్ ఎప్పుడని.. ఏ ఓటిటిలో రిలీజ్ కాబోతుందని ఆరా తీస్తున్నారు ప్రేక్షకులు. ఈ క్రమంలో ట్రిపుల్ ఆర్ ఓటిటి రిలీజ్ గురించి ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది. తాజా సమాచారం ప్రకారం.. RRR మూవీ జూన్ 3 నుండి ‘జీ 5’, నెట్ ఫ్లిక్స్ లలో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తుంది. మరి దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న RRR మూవీ ఓటిటి రిలీజ్ విషయం తెలిసేసరికి ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. కానీ ఈ విషయంపై ఇంకా ధికారైకా ప్రకటన రాలేదు. మరి RRR మూవీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.