ఈమె టీజనే లోనే హీరోయిన్ అయిపోయింది. ఇప్పుడు ఓ పిల్లాడికి తల్లి కూడా అయిపోయింది. చెప్పాలంటే మోస్ట్ పాపులర్ పాన్ ఇండియా హీరోయిన్ అంటే ఈమె పేరే చెబుతారు. ఎవరో గుర్తుపట్టారా?
ఆమె హీరోయిన్. చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసింది. టీనేజ్ లోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి, ఫస్ట్ మూవీతో సూపర్ హిట్ కొట్టింది. అక్కడి నుంచి మొదలుపెడితే.. వరసపెట్టి సినిమాలు చేస్తూనే ఉంది. ఈమె ఉన్న ఇండస్ట్రీలో మిగతా హీరోయిన్లు అందరూ గ్లామర్ తో నెట్టుకొస్తుంటే.. ఈమె మాత్రం యాక్టింగ్ తో శెభాష్ అనిపిస్తోంది. నెపో కిడ్ గా చాలా అంటే ట్రోల్స్ ఫేస్ చేసినప్పటికీ.. తన పని తను చేసుకుంటూ పోతోంది. తాజాగా ఓ మూవీతో పాన్ ఇండియా సూపర్ స్టార్ కూడా అయిపోయింది. మరి ఆమె ఎవరో గుర్తుపట్టారా? లేదా మమ్మల్నే చెప్పేయమంటారా?
వివరాల్లోకి వెళ్తే.. ఈమెది మన దేశం కాదు అయినా సరే హిందీ సినిమాల్లో నటిస్తూ ఫుల్ గా ఎంటర్ టైన్ చేస్తోంది. దాదాపు 11 ఏళ్ల కెరీర్ పూర్తి చేసుకుంది. ఈమె నటించిన సినిమాకు ఆస్కార్ కూడా వచ్చింది. అవును మీరు గెస్ చేసింది కరెక్టే. పైన ఫొటోలో కనిపిస్తున్న చిన్నారి పేరు ఆలియా భట్. ‘RRR’లో సీతగా ఓ చిన్న పాత్రలో నటించిన ఆలియా భట్.. హిందీలో స్టార్ హీరోయిన్. ఈ పాన్ ఇండియా ట్రెండ్ లేకపోయిన టైంలో చాలా క్రేజ్ తెచ్చుకుంది. ఇప్పుడు ఓటీటీ కల్చర్ పెరిగేసరికి ఆలియా పాపులారిటీ మరింత పెరిగిందనే చెప్పాలి.
2012లో ‘స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్’ మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఆలియా.. ఇప్పటివరకు 22 సినిమాల వరకు చేసింది. అందులో దాదాపు చాలావరకు హిట్ లేదంటే బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. ఫ్లాప్ అయిన చిత్రాల్లోనూ ఆలియా, తన వరకు బాగానే ఫెర్ఫార్మ్ చేస్తూ వచ్చింది. ‘బ్రహ్మాస్త్ర’ సినిమా షూట్ టైంలో హీరో రణ్ బీర్ కపూర్ ని లవ్ చేసింది. లాక్ డౌన్ టైంలో వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారు. ప్రస్తుతం వీళ్లకు ఓ కొడుకున్నాడు. సో ఇంతా చెప్పుకున్నాం కానీ ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. అదేంటంటే ఆలియా మన దేశ సిటిజన్ కాదు. తల్లి బ్రిటీష్ కావడంతో ఈమెకు కూడా బ్రిటీష్ పౌరసత్వం ఉంది. సో అదన్నమాట విషయం.. మరి ఈమె చిన్నప్పటి ఫొటో చూసి మీలో ఎంతమంది కనిపెట్టారు? కింద కామెంట్ చేయండి.