దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన పీరియాడిక్ పాన్ ఇండియా మూవీ ‘RRR‘. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన హీరోలుగా రూపొందిన ఈ సినిమా గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలైన ఈ మూవీ.. ఫస్ట్ షో నుండే పాజిటివ్ టాక్ తో అద్భుతమైన కలెక్షన్స్ రాబడుతోంది. బాహుబలి 2తో ఇండియన్ సినిమా స్టాండర్డ్స్, కలెక్షన్స్ మరో స్థాయికి తీసుకెళ్లి.. కొత్త రికార్డులు సెట్ చేశాడు రాజమౌళి.
తాజాగా ఆర్ఆర్ఆర్ తెరకెక్కించి తాను సెట్ చేసిన రికార్డులను తానే బ్రేక్ చేస్తున్నాడు. ఇప్పటికే ట్రిపుల్ ఆర్ మూవీ మూడు రోజుల్లో 60% పైగా వసూళ్లు సాధించింది. ముఖ్యంగా హిందీ వెర్షన్ విషయంలో ట్రిపుల్ కొత్త రికార్డులు సృష్టిస్తుంది. దేశవ్యాప్తంగా హిందీ వెర్షన్ కలెక్షన్స్ రోజురోజుకూ అమాంతం పెరుగుతున్నాయి. మొదటి రోజు 19 కోట్లు, రెండో రోజు 24 కోట్లు వసూల్ చేసిన ట్రిపుల్ ఆర్.. మూడో రోజు 32కోట్లు రాబట్టి విమర్శకుల చేత ఔరా అనిపించింది.హిందీలో మొత్తం మూడు రోజులకు కలిపి RRR మూవీ.. 75 కోట్లు రాబట్టడం విశేషం. ఇక ట్రిపుల్ ఆర్ సినిమాకు హిందీ మార్కెట్ లో రిపీట్ ఆడియెన్స్ వెళ్తుండటం మరో విశేషం. మొదటి రోజు హిందీ మార్కెట్ లో డివైడెడ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకు రెండో రోజు నుండి పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్స్ ఊపందుకున్నాయి. అందులోనూ బాలీవుడ్ ప్రేక్షకులు మెచ్చే తారలు, అద్భుతమైన యాక్షన్ సీక్వెన్సులు సినిమాలో పుష్కలంగా ఉండటం మరో ప్రధాన కారణంగా చెబుతున్నారు. ఇక ఆర్ఆర్ఆర్ మూవీ మేకర్స్ ఊహించిన దానికంటే ఎక్కువ వసూళ్లను రాబడుతుందని.. వీకెండ్ లోపు పెద్ద నెంబర్ సెట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
#RRR #Hindi is SENSATIONAL, biz jumps on Day 3… FIRST *HINDI* FILM TO CROSS ₹ 30 CR IN A SINGLE DAY [pandemic era]… Mass centres EXCEPTIONAL… SupeRRRb trending gives hope for a STRONG Day 4 [Mon]… Fri 19 cr, Sat 24 cr, Sun 31.50 cr. Total: ₹ 74.50 cr. #India biz. pic.twitter.com/zuYKz90RF6
— taran adarsh (@taran_adarsh) March 28, 2022
పాండెమిక్ తర్వాత హిందీలో రోజురోజుకూ కలెక్షన్స్ పెంచుకుంటూ పోయిన సినిమాగా ఆర్ఆర్ఆర్ వార్తల్లో నిలిచింది. ఇక ట్రిపుల్ ఆర్ విషయంలో చిత్రబృందం, మెగా మరియు నందమూరి ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ అనే చెప్పాలి. బాహుబలి తర్వాత తెలుగు నుండి హిందీలో రిలీజైన కబీర్ సింగ్, పుష్పలు కూడా హిందీలో వంద కోట్లకు పైగా రాబట్టాయి. ఇప్పుడు ట్రిపుల్ ఆర్ 100 కోట్ల మార్క్ ని 4 రోజుల్లోనే బీట్ చేస్తుందని ఇండస్ట్రీ టాక్. మరి అలియా భట్, అజయ్ దేవగన్, ఒలీవియా మోరిస్ కీలకపత్రాలు పోషించిన ఈ సినిమా పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.