విషయంతో సంబంధంలేదు, తనకు అనిపిస్తే చాలు రియాక్ట్ అవుతాడు. సందర్భాన్ని బట్టి మారుతుంటాడు. తనకు అనుకూలంగా మర్చాకుంటాడు. ఎప్పుడు ఎవరిని పొగుడుతాడో, ఎవరిని విమర్శిస్తాడో అతనికే తెలియదు.. ఇంత టిపికల్ క్యారెక్టర్ ఎవరా అనుకుంటున్నారా? అతడే వివాదల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. వివాదాస్పద ట్వీట్ లతో సంచలనాలు సృష్టించడం.. ఎదుటి వారిని తమ ట్వీట్ లతో కించపరచడం.. ఆ తరువాత తాను ఎవరినైతే విమర్శించాడో వారినే పొగుడతూ ట్వీట్ లు చేయడం కేవలం వర్మకే చెల్లుతోంది.
ఇది కూడా చదవండి:
గుడివాడ కేసినో వివాదం: కొడాలి నానిపై రామ్ గోపాల్ వర్మ సెటైర్స్!
తాజాగా వర్మ కన్ను నందమూరి బాలకృష్ణపై పడింది. బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తున్న”అన్ స్టాపబుల్ విత్ ఎన్ బీ కే” పై వర్మ మనసు పారేసుకున్నాడు. ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ షోకు నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తూ సినీ సెలబ్రిటీలతో హంగామా చేస్తున్న విషయం తెలిసిందే. తనదైన పంచ్ లతో చమత్కారాలతో షోలోకి ఎంట్రీ ఇచ్చిన సెలబ్రిటీలని ఆకట్టుకుంటూనే నవ్వుల పువ్వుులు పూయిస్తారు బాలయ్య. దీంతో ఈ షో టాప్ లో ట్రెండ్ అవుతోంది.తాజాగా ఈ షోపై వర్మ కన్నుపడింది.
ఇంత మంది సెలబ్రిటీలని పిలిచిన బాలయ్య.. నన్నెందుకు పిలవడం లేదని ఇండైరెక్ట్ గా ఆరా తీస్తూ.. తనదైన మాటలతో ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ బాలయ్యని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాడు RGV. ఇందు కోసం “అన్ స్టాపబుల్ టాక్ షో”పై పొగడ్తల వర్షం కురిపించారు. ఇదో స్ట్రాటో ఆవరణ ప్రోగ్రామ్ అంటూ ప్రశంసలు కురిపించాడు. మరి.. ఇప్పటికే టాప్ రేటింగ్ ని సొంతం చేసుకున్న ఈ షోలో ఆర్జీవీ ఎంట్రీకి బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇస్తారా లేదా అనేది హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.