ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘పుష్ప- పార్ట్ 1’ చిత్రం ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం అనేక రికార్డులు తిరగరాసింది. విడుదలైన అన్నిచోట్ల భారీ వసూళ్లు సాధించింది. ఈ క్రమంలో పుష్ప-2 మూవీపై అంచానాలు భారీగా పెరిగాయి. కేవలం సౌత్ ప్రేక్షకులు మాత్రమే కాక అన్ని భాషల వాళ్లు.. ఈ చిత్రం పార్ట్-2 కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో పుష్ప-2 కు సంబంధించి కీలక అప్ డేట్ వచ్చేసింది.
‘పుష్ప- ది రైజ్’.. బాలీవుడ్‌లో ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఈ చిత్రం రెండో భాగం అక్కడి ప్రేక్షకులు మరింత రిలేట్ అయ్యేలా ఓ హిందీ స్టార్‌ను కీలక పాత్ర కోసం ఎంచుకోవాలని చిత్ర బృందం భావించిందట. అందుకు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ అయితే బాగుంటుందని ఆయననే ఎంచుకున్నట్లు సమాచారం. ఈ మేరకు ఒప్పించే ప్రయత్నాలు కూడా మొదలుపెట్టారన్నట్లుగా గుసగుసలు వినపడుతున్నాయి. ‘పుష్ప- పార్ట్ 2’లో ప్రతి నాయకుడిగా ఫహాద్ ఫాజిల్‌ను మార్చడం లేదని, ఆయనే మెయిన్ విలన్‌గా ఉంటారని చిత్రబృందం చెబుతోంది. అయితే ఓ కీలక పాత్ర కోసమే సల్మాన్ ఖాన్ ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల చిరంజీవి ‘గాడ్ ఫాదర్’లో సల్మాన్ ఖాన్ చేసిన గెస్ట్ రోల్‌కు మంచి పేరొచ్చింది. ఈ తరుణంలో ‘పుష్ప 2’ కు కూడా ఆయననే ఎంచుకున్నట్లు తెలుస్తోంది.
ఇక పుష్ప-2లో నటిస్తోన్న వారిపై ఇప్పటికే రకరకాల అప్ డేట్స్ వస్తున్నాయి. ఈ సినిమాలో సాయి పల్లవి, సీనియర్ హీరోయిన్ ప్రియమణి కనిపించనున్నారని వార్తలొస్తున్నాయి. అలాగే.. బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్ కూడా ఈ సినిమాలో కీలక పాత్ర చేస్తున్నాడని టాక్. ఈ సినిమాలో మరో పోలీస్ క్యారెక్టర్ ఉందట.. ఆ క్యారెక్టర్ లోనే అర్జున్ కపూర్ నటించబోతున్నట్టు తెలుస్తుంది. వీటిలో ఎన్ని నిజాలో ఎన్ని అబద్ధాల్లో తెలియదు కానీ, ఈ వార్తలు మాత్రం నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. మరి ఇంతమంది నటిస్తున్నప్పుడు సుకుమార్ ప్లానేంటి? కథలో మార్పులు ఏమైనా ఉంటాయా? అని నెటిజన్స్ ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. వీటిపై చిత్రబృందం ఏమైనా క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.
After Arjun Kapoor New rumour: Salman Khan To Play Extended Cameo In Bigger Budgeted Pushpa 2? Details Inside#SalmanKhan #Pushpa #Pushpa2 #AlluArjun https://t.co/dzCrimQPU6
— Box Office Worldwide (@BOWorldwide) October 14, 2022