రితికా నటించిన ‘ఇన్ కార్’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఆమె ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్లలో బిజీగా గడుపుతోంది. ఈ నేపథ్యంలోనే ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. మీడియా ప్రతినిధులు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
రితికా సింగ్.. తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరిది. ‘గురు’ సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నారామె. స్వతహాగా బాక్సింగ్ ఛాంపియన్ అయిన ఈమె వెండితెరపైకి కూడా బాక్సర్ క్యారెక్టర్‌తో ఎంట్రీ ఇచ్చారు. బాక్సింగ్ నేపథ్యంలో సాగే ‘ఇరుది చుట్రు’’ అనే తమిళ సినిమాలో లీడ్ రోల్ చేశారు. మొదటి సినిమాకే నేషనల్ అవార్డు గెలుచుకున్నారు. అదే సినిమాను తెలుగులో ‘గురు’గా రీమేక్ చేశారు. ఇందులోనూ ఆమె నటించారు. తర్వాత తెలుగులో ‘నీవెవ్వరో’ సినిమా చేశారు. ఈ సినిమా తర్వాత తెలుగులో ఏ సినిమా చేయలేదు. కానీ, తమిళంలో మాత్రం వరుస సినిమాలు చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఆమె నటించిన ‘ఇన్ కార్’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో రితికా సింగ్ సినిమా ప్రమోషన్లలో బిజీగా గడుపుతున్నారు.
తాజాగా జరిగిన ఓ మీడియా ప్రతినిధుల సమావేశంలో రితికాకు చేదు అనుభవం ఎదురైంది. వస్తానన్న టైం కంటే ఆలస్యంగా మీటింగ్‌కు రావటంతో మీడియా ప్రతినిధులు ఆమెపై ఫైర్ అయ్యారు. మీడియా సమావేశానికి మూడు గంటలు ఆలస్యంగా వస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా ప్రతినిధుల ఆగ్రహంతో ఆమె కంగుతిన్నారు. తాను కావాలని లేటు చేయలేదని మిస్ కమ్యూనికేషన్ కారణంగా ఆలస్యం అయిందని చెప్పారు. ఆలస్యం అయినందుకు స్టేజి మీదనుంచే మీడియా ప్రతినిధులకు క్షమాపణలు చెప్పారు. దీంతో శాంతించిన వారు మీటింగ్‌ను కొనసాగించారు.
కాగా, రితికా సింగ్ ‘ఇరుది చుట్రు’ సినిమా తర్వాత విజయ్ సేతుపతితో కలిసి ఆండవన్ కట్టలై అనే సినిమాలో నటించారు. 2017లో రాఘవా లారెన్స్‌తో కలిసి ‘శివలింగ’ సినిమాలో నటించారు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించలేదు. ఆ తర్వాత వచ్చిన ‘ఓ మై కడువలే’ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. తెలుగులో ‘ఓరి దేవుడా’గా రీమేక్ అయింది. ఇక్కడ కూడా మంచి ఫలితాలను రాబట్టింది. రితికా ప్రస్తుతం పిచ్చకారెన్ 2, వనంగ ముడి, కొలై, కింగ్ ఆఫ్ కొత సినిమాల్లో నటిస్తున్నారు. మరి, మీడియా ప్రతినిధులు రితికాపై ఆగ్రహం వ్యక్తం చేయటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.