బౌండరీస్ అంటూ లేని నటి రెజీనా. ఒక కమర్షియల్ సినిమాల్లో నటిస్తూనే.. మరో పక్క వైవిధ్యమైన కథలతో, వైవిధ్యమైన పాత్రలతో అలరిస్తున్నారు. హీరోయిన్ గానే కాకుండా స్పెషల్ సాంగ్ లతో కూడా ఉర్రూతలూగిస్తున్న రెజీనా.. సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తున్నారు. తాజాగా ఈమె నటించిన చిత్రం ‘శాకిని డాకిని’. సుధీర్ వర్మ దర్శకత్వంలో యాక్షన్ కామెడీ ఫిల్మ్ గా తెరకెక్కిన ఈ సినిమాలో రెజీనాతో పాటు నివేదా థామస్ కూడా నటించారు. లేడీ మల్టీస్టారర్ గా రాబోతున్న ఈ సినిమా సెప్టెంబర్ 16న రిలీజ్ కాబోతున్న సందర్భంగా ముద్దుగుమ్మలిద్దరూ మూవీ ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటున్నారు. సినిమా ప్రమోషన్ లో భాగంగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఈ ఇంటర్వ్యూలో రెజీనా మగవారిని ఉద్దేశించి వేసిన అడల్ట్ జోక్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “అబ్బాయిల మీద పెద్ద జోక్ ఉంది. కానీ ఇక్కడ ఆ జోక్ వేయకూడదు” అంటూనే అబ్బాయిల మీద డబుల్ మీనింగ్ జోక్ వేసి వార్తల్లో నిలిచారు. “అబ్బాయిలు, మ్యాగీ రెండూ 2 మినిట్స్ లో అయిపోతారు” అంటూ డబుల్ మీనింగ్ డైలాగ్ ఒకటి కొట్టారు. ప్రస్తుతం రెజీనా చేసిన ఈ డబుల్ మీనింగ్ జోక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాగా రెజీనా, నివేదా థామస్ నటించిన ‘శాకిని డాకిని’ సినిమా 2017లో వచ్చిన సౌత్ కొరియన్ మూవీ “మిడ్ నైట్ రన్నర్స్”కి అఫీషియల్ రీమేక్ గా వస్తుంది. మరి రెజీనా మగవారిపై పేల్చిన డబుల్ మీనింగ్ జోక్ పై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి.
Mass🔥 attitude with cute looks👰🏻🧛♀️@ReginaCassandra @i_nivethathomas ❤️❤️ pic.twitter.com/frYqmRkvop
— Gwri (@prettyGowri) September 9, 2022