భీమ్లానాయక్ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలై.. రికార్డుల వేట కూడా మొదలు పెట్టేసింది. బ్లాక్ బస్టర్ టాక్ తో పవన్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే సినిమా విషయంలో పవన్ అభిమానులు, ప్రేక్షకులు ఒకింత అసహనంతో ఉన్న మాట వాస్తవమే. అది ఎందుకంటే ఒకటి ‘అంత ఇష్టమేందయ’ సాంగ్ సినిమాలో లేదు. రెండు.. భీమ్లానాయక్- డానియల్ శేఖర్ ను బైక్ పై ఎక్కించుకెళ్లే సీన్ లేకపోవడం.
అంత ముఖ్యమైన రెండు అంశాలను కట్ చేయడంపై అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే పాట ఎందుకు లేదు అనేదానిపై క్లారిటీ వచ్చింది. అది కథ నడిచే టెంపోలో సాంగ్ ఎక్కడా సెట్ కాకపోవడంతో.. మూవీ ఫీల్ మిస్ కాకూడదని సాంగ్ కట్ చేసినట్లు తెలుస్తోంది. మరి అభిమానులు ఇప్పటికైనా చల్లబడతారేమో చూడాలి. లేదంటే ఆ సాంగ్ ను మళ్లీ ఎడిట్ చేసే ఆలోచన ఏమైనా ఉందేమో వెయిట్ చేసి తెలుసుకోవాల్సిందే. సాంగ్ పెట్టక పోవడంతో మీరు అసహనానికి లోనయ్యారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.